గుండెకు చిల్లులు .. ఆర్థిక సాయం కోసం వేడుకోలు

రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో ఆ దంపతులు  చాలా ఆనంద పడ్డారు. ఇంటిల్లిపాది సంతోషించారు. సరిగ్గా మూడు మాసాలకు డాక్టర్లు చెప్పిన మాట ఆ కుటుంబాన్ని కుదిపేసింది. మీ పిల్లవాడికి గుండెలో రంధ్రాలు ఉన్నాయని చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు. కన్నపేగును కాపాడుకోవాలని చాలా ఆసుపత్రులకు వెళ్లారు. వైద్యులు  సూచించిన పరీక్షలకు వేల రూపాయలు  చెల్లించారు. ఆపరేషన్‌కు లక్షల రూపాయలు  ఖర్చవుతుందని తెలిసి కొడుకు ప్రాణాల కోసం అప్పు చేశారు. రెండోసారి ఆపరేషన్‌ చేయాల్సి రావడంతో డబ్బు అవసరమైంది. పేద కుటుంబం కావడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు.

అనంతపురం జిల్లా గోరంట్ల మండలకేంద్రానికి చెందిన మైలారు సురేష్‌, అరుణమ్మ దంపతులకు మగ్గమే జీవనాధారం. చీరె నేస్తేగాని పూట గడవని పరిస్థితి. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. మొదటి కొడుకు సందీప్‌. పదో తరగతి చదువుతున్నాడు. రెండు కొడుకు దేదీప్య కుమార్‌. 6వ తరగతి చదువుతున్నాడు. సురేష్‌ భార్య గృహిణి.

దేదీప్య పరిస్థితి సురేష్‌ మాటల్లోనే..

‘‘దేదీప్య పుట్టిన 3 మాసాలకు అనారోగ్యానికి గురయ్యాడు. చిన్నప్లిల్లల  వైద్యుడిని సంప్రదించాము. కొన్ని రకాల పరీక్షలు చేయించారు. గుండెలో రంధ్రాలు  ఏర్పడ్డాయని చెప్పారు. చికిత్స కోసం పులివెందుల, బెంగుళూరు, అనంతపురం, పుట్టపర్తిలో కార్పొరేట్‌ ఆసుపత్రులకు తీసుకెళ్లి చూయించాము. చివరకు హైదరాబాద్‌ తార్నాకలోని ఇన్నోవా హాస్పిటల్‌కు వెళ్లాం. మరోసారి వైద్య పరీక్షలు  చేసిన డాక్టర్లు పిల్లవాడికి గుండెలో మూడు రంధ్రాలు  ఉన్నాయని చెప్పారు. ఐదేళ్ల వయసు రాగానే ఆపరేషన్‌ చేస్తామన్నారు. వారు చెప్పిన సమయానికే దేదీప్యను ఆసుపత్రికి తీసుకెళ్లాం. రెండు రంధ్రాలకు ఆపరేషన్‌ చేశారు. అప్పటికే మాకు రూ. 5 లక్షలు ఖర్చయ్యింది. ఆపరేషన్‌ తర్వాత సంవత్సరానికి రెండు సార్లు వైద్య పరీక్షలు  చేయించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం దేదీప్య వయసు 13 సంవత్సరాలు. ఏడేళ్ల పాటు వైద్య పరీక్షకు దాదాపు రూ. 4లక్షలు ఖర్చయ్యింది. ప్రస్తుతం మరో రంధ్రానికి ఆపరేషన్‌ చేయడానికి ఇన్నోవా హాస్పిటల్‌కు తీసుకువచ్చాం. మార్చి 2న ఆపరేషన్‌ చేస్తామన్నారు. ఈ సారి ఆపరేషన్‌కు రూ. 4లక్షలు ఖర్చవుతుందని వైద్యులు  చెప్పారు. అందులో కొంత డబ్బు చెల్లించాను. ఆపరేషన్‌ అయ్యాక మిగతా డబ్బు కట్టమని హాస్పిటల్‌ సిబ్బంది చెప్పారు. దేదీప్య ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటానికి ఇంకొంత డబ్బు ఖర్చవుతుంది. చేతనైనంత ఆర్థిక సాయం చేసి దేదీప్యను ఆదుకుంటారని ఆశిస్తున్నాను.’’
– మైలారు సురేష్‌,

సెల్ నంబర్ : 94919 83276, 96667 74759

ఆర్థిక సాయం కోసం బ్యాంకు వివరాలు 

NAME: MAILARI SURESH
SBI A/c. NO.30840071006
IFSC : SBIN0002722

GOOGLE PAY/PHONE PAY
Cell No. 9491983276 Handelsfjord

Follow us on social media

Related posts

Leave a Comment