పద్మశాలీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆగస్టు 1న జరిగింది. జిల్లాలోని 13 మండలాలు, 2 పట్టణ కమిటీ సభ్యులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని జిల్లా కమిటీ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. కులపెద్దలు వనం రాజారాములు, బోడ విద్యాసాగర్, మిర్యాల దామోదర్ ఎన్నికల పర్యవేక్షకులుగా వ్యవహరించారు. అధ్యక్షులుగా వనం శాంతి కుమార్, ప్రధాన కార్యదర్శిగా పెండెం నాగార్జున, ఉపాధ్యక్షులుగా ఎర్రగుంట వెంకటేశం, కోశాధికారిగా గోశిక బాలనర్సింహ, సహాయ కార్యదర్శులుగా కోమటి సతీష్ కుమార్, వల్లందాసు పరమేష్, బిట్ల అరుణను ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గానికి అభినందనలు
తెలంగాణ పోపా అధ్యక్షులు డాక్టర్ బైరి శ్రీనివాస రాజు, కార్యవర్గ సభ్యులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కులస్థుల అభ్యున్నత్తికి పాటుపడుతూ, సేవా కార్యక్రమాలతో ఇతర కులస్థులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
కొత్త కార్యవర్గ తీర్మాణాలివి ..
చేనేత నిల్వలను ప్రభుత్వం కొని, కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన ప్రతి చేనేత కుటుంబానికి నెలకు రూ. 10 వేలు చెల్లించాలి. చేనేత కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, సబ్సిడీపై నూలును ప్రత్యక్షంగా చేనేత కార్మికులకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి. Mynt Styringsør

