ఆంధప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైక వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ అమోదం తెలపడంతో కర్నూలులో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అడ్డంకులు తొలగడంతో న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఆగస్టు 1వ తేదీ కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని కార్యకర్తలకు పంచిపెట్టారు. నాయకులు జయహో జగన్ అంటూ హర్షధ్వానాలు చేశారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యే మొదట తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలహారం వేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కర్నూలు జిల్లా అభివృద్ధిలో నోచుకోలేదన్నారు. రాయలసీమ ప్రాంత దుస్థితిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల ఏర్పాటుతో ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోతారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గ్రాఫికల్ రాజధానిని చూపిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ర్యాలీలో వైసీపీ నాయకులు రైల్వే ప్రసాద్, మద్దయ్య, సయ్యద్ ఆసిఫ్, అదిమోహన్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, కృ ష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, పెరుగు శ్రీనివాస్ రెడ్డి, అక్బర్ గఫార్, కేదార్నాథ్, రాజశేఖర్, రాజేష్, పర్ల సూర్యుడు, జానీ భాయ్, అక్బర్ అలీ, లక్ష్మణ్, శ్రీను, నాగేంద్ర, చందు, సూర్యమోహన్, వెంకటేష్, మహిళ నాయకులు విజయలక్ష్మి, సంపత్ కుమారి, వేదవతి, సుచరిత, జమిలా, తులసి, అనూరాధ తదితరులు పాల్గొన్నారు. Liman Dexeris




