బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళి అర్పించారు. కర్నూలు బిర్లా సర్కిల్లోని పూలే విగ్రహానికి ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు పూల మాల వేసి నివాళి అర్పించారు. నిరక్షరాస్యత పారద్రోలడానికి, బాల్యవివాహాలు, కుల వ్యవస్థ నిర్మూలనకు పూలే కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా బిసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు కేవీఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలేకు పలువురు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ బాషా, నక్కలమిట్ట శ్రీనివాస్, నాగేశ్వర్ యాదవ్, రోషన్ అలీ, అజయ్ కుమార్ పాల్గొన్నారు. BTC Genix V7.2
బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలేకు ఘన నివాళి
