ప్రతి చేనేత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 10వేలు చెల్లించాలి: రాజోలి నేత కార్మికులు

జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో దాదాపు 1000 కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి.  లాక్‌డౌన్‌ కారణంగా వస్త్రాల తయారీకి వాడే పట్టు రేషం, జరి, రసాయనాలు ఇతర రాష్ట్రాల నుంచి రావడం లేదు. దీంతో నేతన్నలు ఉపాధి కోల్పోయారు. పనులు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. ఈ సమస్యల నుంచి తేరుకోడానికి దాదాపు 6 మాసాల సమయం పడుతోంది. అంతవరకు తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు మే 19న అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాంకు వినతిపత్రం అందజేశారు. బతుకమ్మ చీరలను కొన్నవిధంగానే గద్వాల పట్టు చీరలను తమ నుంచి కొనుగోలు చేయాలని, జియోట్యాగ్‌ చేయించుకున్న ప్రతి చేనేత కార్మికుడికి డీఆర్‌డీఏ ద్వారా 50 శాతం సబ్సిడీతో పూచీకత్తు లేకుండా రూ. 5 లక్షణ రుణం ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన ప్రతి చేనేత కుటుంబానికి తక్షణ సాయంగా నెలకు రూ.10 వేలు అందజేయాలని చేనేత కార్మికులు ఒక్కిలి నాగేష్‌, శిరసాల మధు, గోరకల్‌ వీరేష్‌, వెంకట్రాముడు, బండా శివప్రసాద్‌, కనికె వెంకటేష్‌, సూర లక్ష్మీనారాయణ, కొంకతి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు దృష్టికి తీసుకెళ్లాలని వారు ఎమ్మెల్యేను కోరారు. Ascenso Finviora

Follow us on social media

Related posts

Leave a Comment