వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పద్మశాలీ పాత్రికేయులకు హైదరాబాద్‌లో నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ బర్రెంకల మధుసూదన్ నిర్ణయం మేరకు మే 25వ తేదీ పద్మశాలి భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రూ. 600 విలువ చేసే నిత్యావసరాల కిట్ (10 కిలోల బియ్యం,కిలో కందిబ్యాళ్లు, లీటర్ వంటనూనె, కారం ప్యాకెట్, 5 రకాల కూరగాయలు)లను 30 మంది విలేఖరులకు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ పద్మశాలీయులు నిర్వహించే సభలు, సమావేశాలు, సేవా కార్యక్రమాలను బాగా ప్రచురితమయ్యేలా చూడాలని కోరారు. కులస్థుల అభ్యున్నతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ కార్యదర్శి చిప్ప రఘురాములు, వైస్ చైర్‌పర్సన్ మోత్కూరి విజయలక్ష్మి కృష్ణ, కోశాధికారి కందగట్ల స్వామి, సామాజిక విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షులు, సూర్యాపేట జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు గుండేటి శ్రీధర్, అఖిల భారత పద్మశాలి సంఘ మహిళ విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, ప్రధాన కార్యదర్శి మిర్యాల విశ్వరేఖ, అఖిల భారత పద్మశాలీ సంఘ న్యాయ విభాగం అధ్యక్షులు వనం విశ్వనాథం, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి మహిళ విభాగం అధ్యక్షురాలు గాడిపల్లి సంధ్య , ప్రధాన కార్యదర్శి పోరండ్ల శారద , తెలంగాణ పద్మశాలీ మహిళ సంఘ రాష్ట్ర కార్యదర్శి మడూరి శశికళ పాల్గొన్నారు. జర్నలిస్టులకు కిట్లు పంపిణీ చేసిన వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కమిటీ సభ్యులకు తెలంగాణ పద్మశాలీ సంఘ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ అర్రం నర్సింగ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.



చేనేతలకు సేవా కార్యక్రమాలు, వారి సమస్యలు, పరిష్కార మార్గాలను వాట్సప్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి. Liman Dexeris


