చేనేత ఉద్యోగులు, కార్మికుల అభ్యున్నతే లక్ష్యం: ఏపీ వెపా – గుంటూరు జిల్లా వాసులతో వీడియో కాన్ఫరెన్సు

చేనేత ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో శాఖల విస్తరణ దిశగా ముందుకు సాగుతున్నామని ఏపీ వెపా (ఆంధప్రదేశ్‌ వీవర్స్ ఎంప్లాయిస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌) రాష్ట్ర సంఘం అధ్యక్షులు కేవీ శేషయ్య తెలిపారు. వెపా వీడియో కాన్ఫరెన్సు ఆగస్టు 30వ తేదీ రాత్రి 7 నుంచి 10.30 గంటల వరకు జరిగింది. ఈ కాన్ఫరెన్సుకు కేవీ శేషయ్య, గుంటూరు జిల్లా బాధ్యులు, చేనేత కవి రాపోలు జగన్‌ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ సంఘం ఆవిర్భావం తర్వాత రెండేళ్ల కాలంలో సాధించిన విజయాలను వివరించారు. చేనేతలలో ఐక్యత, చైతన్యం, అభ్యున్నతి కోసం తాను త్వరలో స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు సభ్యుల పరిచయ కార్యక్రమం జరిగింది.

వెపా నెల్లూరు జిల్లా అధ్యక్షులు సజ్జా వెంకట సురేష్‌ వెపా ఆవిర్భావం, లక్ష్యాలు, సేవా కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చేనేత పేద కుటుంబాలకు రూ. 8 లక్షల విలువ చేసే నిత్యావసరాలను పంపిణీ చేశామని వివరించారు. అర్హులైన చేనేతలందరికి సంక్షేమ పథకాలు వర్తించేలా చూస్తామన్నారు.

ప్రస్తుత తరుణంలో చేనేతల ఐక్యత, సంఘటితం కావాల్సిన ఆవశ్యకతపై పలువురు ప్రసంగించారు. గుంటూరు జిల్లా నుంచి ప్రముఖ హై కోర్టు న్యాయవాది వైకే, గంజి చిరంజీవి, ముశం అనంతరాములు, పిల్లల మర్రి నాగేశ్వరరావు, బట్టు రవీంధ్రనాథ్‌ బాబు, చిలువేరు మార్కండేయులు, చిలువేరు గణేష్‌, బీవీవీ సత్యనారాయణ, అడిగోపుల వెంకటేశ్వర బాబు, గోలి ప్రభాకర్‌, తుమ్మ పాపారావు, పులిపాటి గంగాధర్‌, రామనాథం, రామకృష్ణ, గుర్రం చిన్న వీరయ్య, గంజి ఏడుకొండలు, లీలా మాధవ రావు, గోలి మహేష్‌, శీలం మల్లికార్జున, గోలి భానుప్రసాద్‌, సూరేపల్లి శ్రీనివాసరావు, మసన రమేష్‌ కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఇతర జిల్లాల నుంచి మేరువ వెంకటేశ్వర్లు, బడతల ప్రభాకరరావు, చంద్రశేఖర రావు, బండారు సురేష్‌ బాబు, పీఎస్‌ గోపాల్‌, తిరుపాలు, తాటిపర్తి వెంకటేశ్వర్లు, దివిశేఖర్‌, శివకుమార్‌, పల్లా మాలకొండయ్య, కొనిశెట్టి లక్ష్మయ్య, మీసాల రాజశేఖర్‌, నాలి అప్పారావు, మాచర్ల పాపారావు, పేరంశెట్టి శ్రీరామ ప్రసాద్‌, సూరి సుధాకర్‌, పి. చంద్రశేఖర్‌, చిన్నంహరి గోపాల్‌, కే నాగశేషయ్య, రాపోలు వీరమోహన్‌ పాల్గొన్నారు.

Záloha Valnex

Follow us on social media

Related posts

Leave a Comment