లాక్డౌన్ కారణంగా నేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేసిన వేలకొద్ది టవాళ్లు వారి ఇళ్లలోనే ఉండిపోయాయి. కరోనా సమయంలో వాటిని అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలు, తెలంగాణ పద్మశాలీ మహిళ సంఘం గౌరవ అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్, అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్ 1000 టవాళ్లను కొన్నారు. చేనేత కార్మికులకు ఆదుకునే వారు వీటిని కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా హోల్సేల్ ధరకే అమ్ముతున్నట్లు తెలిపారు. 72 ఇంచులు పొడవు, 36 ఇంచులు వెడల్పు ఉండే టవల్ ఖరీదు రూ. 150లకు విక్రయిస్తున్నామన్నారు. ఇదే టవల్ బయట మార్కెట్లో రూ. 225లకు అమ్ముతారని తెలిపారు. ప్రస్తుతం రవాణ, కొరియర్ సౌకర్యం లేనందున కేవలం హైదరాబాద్లో ఉండే వారు స్వయంగా వచ్చి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసక్తిగల వారు తనను సంపద్రించాలని గుండేటి శ్రీధర్ (9989864789) కోరుతున్నారు.
చేనేత వర్గాల సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.com లో వీక్షించండి. Kruvestal


