కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు – ఆత్మకూరు తహసీల్దార్‌ను వినతిపత్రం అందజేసిన చేనేతలు

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో చేనేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు జూలై 30వ తేదీకి 10వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం నవీన్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో పది మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. 45 సంవత్సరాల వయసు దాటిని ప్రతి చేనేత కుటుంబంలోని భార్యాభర్తలకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ చేనేత దినోత్సవంలోగా చేనేతలకు ఆదుకునేందుకు పాలకుల నుంచి సమాధానం రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం సమస్యల వినతి పత్రాన్ని ఆత్మకూరు తహసీల్దార్‌ జ్యోతికి అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం నవీన్‌, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జల్ది రాములు, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్తాన్‌ పురుషోత్తం, ఆత్మకూరు పద్మశాలీ సంఘం మండల కార్యదర్శి వంగ శ్రీనివాసు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాశుకంటి లక్ష్మీనర్సయ్య, శ్రీనివాస్‌, సతీష్‌, సూర్యనారాయణ, మద్దయ్య , గుర్రం నర్సింహులు, అంబదాసు, అంజయ్య, సత్యనారాయణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.తక్షణమే రూ. 500 కోట్లు విడుదల చేయాలి 
– తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ యువజన సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పబ్బతి పవన్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ యువజన సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పబ్బతి పవన్‌ కుమార్‌ రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు.
జూలై 28వ తేదీన ఆయన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు తక్షణమే రూ. 500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులు, సంఘాల వద్ద ఉన్న వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేసి, ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి రూ. 8 వేల చొప్పున ఆరు మాసాల పాటు కనీస జీవన భృతి చెల్లించాలన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి నెలకోసారి 40 శాతం సబ్సిడీతో నూలు అందించాలని కోరారు. చేనేత కార్మికులకు నిరంతరం పని ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం నవీన్‌, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జల్ది రాములు, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్తాన్‌ పురుషోత్తం, చేనేత కార్మికులు గుర్రం నరసింహ, మహేశ్వరం, మురళీ కస్తూరి, కృష్ణ రచ్చ భిక్షపతి, భావనారుషి బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.

చేనేత సమాజంలోని వివిధ వర్గాల కార్యవర్గ, సర్వసభ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, సేవా కార్యక్రమాలు, చేనేతల అభ్యున్నతికి ఉపయోగపడే విషయాలను వాట్సప్‌ నెంబర్‌ 83338 71117 పంపాలని మనవి. వాటిని వెబ్‌సైట్‌ www.chenetamitra.comలో పొందుపరుస్తాం. Pulse Finvio Gpt

Follow us on social media

Related posts

Leave a Comment