టీఆర్‌పీఎస్‌ అధ్యక్షుడి ఎన్నికకు ఓటరు సభ్యత్వ నమోదు కార్యక్రమం

చేనేతమిత్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టీఆర్‌పీఎస్‌) అధ్యక్షుడి ఎన్నిక కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఆయా జిల్లాల కన్వీనర్లు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజీ అయ్యారు. ఇటీవల సికింద్రాబాద్‌లోని బెల్‌సన్స్ ‌తాజ్‌ ‌మహల్‌ ‌హోటల్‌లో టీఆర్‌పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షులు రామ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమైన విషయం తెలిసిందే. ఓటరు సభ్యత నమోదు, సంఘం బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఓటరు సభ్యత్వ రుసుము రూ. 100లుగా నిర్ణయించారు. 
రంగారెడ్డి ‌జిల్లాలో..

టీఆర్‌పీఎస్‌ ‌రంగారెడ్డి ‌జిల్లా కన్వీనర్‌ ‌మచ్చ సుధాకర రావు ఈ నెల 7వ తేదీన షాబాద్‌, ‌చౌదర్‌గూడ, చేవెళ్ల, బండ్లగూడ మున్సిపాలిటీ, మొయినాబాద్‌ ‌మండలాల్లో పర్యటించారు. ఆయా మండలాల అధ్యక్షులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు. తమ పరిధిలో సభ్యత్వ నమోదు చేయించాలని వారిని కోరారు. సుధాకర రావు వెంట బాస విట్టల్‌, ‌బాస నరసింహులు, జాల్ద మల్లేష్‌, ‌పానుగంటి శ్రీను, సర్పంచ్‌ ‌గూడ స్వామి, గూడ రమేష్‌, ‌వర్కల శివరాజు, వర్కల వెంకటేష్‌, ‌గూడ రవీందర్‌, ‌సర్పంచ్‌ ‌సర్దానగర్‌ ‌సర్పంచ్‌ ‌మునగపటి నరసింహులు, పాండాల చంద్ర శేఖర్‌ ,‌బిజ్జ రమేష్‌ ఉన్నారు.

హనుమకొండ జిల్లాలో..

హనుమకొండ జిల్లా పరిధిలోని ఆత్మకూరు మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు వి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశాలి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ‌చందా మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పాసికంటి రాజేందప్రసాద్‌ ‌హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఇరసడ్ల సదానందం, మండల కమిటీ ఉపాధ్యక్షుడు పాపని రవీందర్‌, ‌జిల్లా కార్యవర్గ సభ్యులు వి సదానందం, ఆత్మకూరు గ్రామ అధ్యక్షుడు వడ్డేపల్లి వేణుగోపాల్‌, ‌బూర రాజేందర్‌, ‌చిమ్మని భిక్షపతి, మార్త రంజిత్‌, ‌కుమార్‌, అల్వాల రవి, బలబద్ర కిషోర్‌, ‌కొంపెల్లి రవి పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా హంటర్‌ ‌రోడ్‌ ‌న్యూశాంపేట 31వ డివిజన్‌ పద్మశాలీ కార్యవర్గానికి సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు. 8వ తేదీ దామెర, దర్గా కాజీపేట, కుమార్‌పల్లి, కొత్తూరు జెండా డివిజన్‌, ‌రెడ్డి కాలనీ డివిజన్‌,‌యాదవ నగర్‌ ‌డివిజన్‌లో పర్యటిస్తానని చందా మల్లయ్య తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో..


కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సిరిగాధ లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు, జిల్లా నాయకుల నుంచి విశేష స్పందన రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్‌ ‌కమిటీ అధ్యక్షులు ఐరన్‌ ‌నరసయ్య, కోశాధికారి సబర్‌ ‌ధర్మపురి పాల్గొని సభ్యత్వం తీసుకున్నారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

 

 

Evitraps

Follow us on social media

Related posts

One Thought to “టీఆర్‌పీఎస్‌ అధ్యక్షుడి ఎన్నికకు ఓటరు సభ్యత్వ నమోదు కార్యక్రమం

Leave a Comment