సభ్యత్వంతో ఐక్యత చాటుదాం.. రామశ్రీనివాస్‌

‌చేనేతమిత్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టీఆర్‌పీఎస్‌) అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆయా జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అదే క్రమంలో సంఘ సమన్వయ కర్త అడిచెర్ల శ్రీనివాస్‌ ఏ‌ప్రిల్‌ 9‌వ తేదీ కరీంనగర్‌ ‌జిల్లా కేంద్రంలోని నేత బజారులో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టీఆర్‌పీఎస్‌ ‌నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షులు రామ శ్రీనివాస్‌ ‌ప్రసంగించారు. ఆదర్శవంతమైన సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటూ.. పద్మశాలియుల సత్తా నిరూపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పల్లెలోని పద్మశాలీయులంతా సభ్యత్వం తీసుకుని ఐక్యత చాటాలని కోరారు. తర్వాత పలువురు సంఘ నాయకులు మాట్లాడారు. అడిచెర్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మార్తా రమేష్‌, ‌బురా మల్లేశం, వేముల బాలరాజు, పేరళ్ల పురుషోత్తం, బైరి శ్రీనివాసరాజు, మంచికట్ల ఆశమ్మ, వేముల రామ్మూర్తి, వనం సుమన్‌, ‌కస్తూరి సుజాత, ప్రసన్న, యువజన విభాగం ప్రతినిధులు వొడ్నాల రాజు, జక్కని సంజయ్‌, ఎలిగేటి శ్రీనివాస్‌, ‌పోరండ్ల రమేష్‌, ‌గాలి శంకర్‌, ‌చిలకమర్రి శ్రీనివాస్‌, ‌కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

 

Baltic Capital

Follow us on social media

Related posts

Leave a Comment