బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

బుట్టా ఫౌండేషన్‌, వయో వృద్ధుల సంక్షేమ సంఘం సంయుక్త అధ్వర్యంలో ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్‌ 1వ తేదీన ఘనంగా నిర్వహించారు. కర్నూలు చిల్డ్రన్స్ పార్కులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి  పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కొండా రెడ్డి బురుజు సర్కిల్‌లోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ రాష్ట్ర ప్రజలకు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక తరుపున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వయో వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సహదేవ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అర్హులందరికి సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుందన్నారు. సంఘం కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి క్రిష్టఫర్‌, మద్దిలేటి రెడ్డి, డాక్టర్‌ జయ ప్రకాష్‌, రత్నారెడ్డి, ప్రసాద్‌ పాల్గొన్నారు. Evitraps

Follow us on social media

Related posts

Leave a Comment