కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చేనేతమిత్ర మాసపత్రిక ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టిలో తీసుకెళ్లనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి రాపోలు వీరమోహన్. ప్రస్తుతం చేనేతల దుస్థితి, ఆర్థిక ఇబ్బందులను ‘చేనేతమిత్ర’ ప్రతినిధికి వివరించారు.
‘యాదాద్రి భువనగిరి జిల్లాలో నూటికి అరవై శాతం ప్రజలు నేత కార్మికులు. నేత వృత్తే జీవనాధారం. కరోనా ప్రభావంతో మగ్గాల మీద పనులు ఆగిపోయాయి. లాక్‌డౌన్ కంటే ముందే తయారైన వందల కోట్ల విలువైన వస్త్రాలు మాస్టర్ వీవర్ల వద్దే ఉండిపోయాయి. లాక్‌డౌన్ వల్ల చాలావరకు వస్త్రాల కొనుగోళ్లు తగ్గిపోవడంతో చేనేత కార్మికులకు పనులు లేక పస్తులుంటున్నారు. కొంతమంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పూనుకున్నారు. టెస్కో ద్వారా నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. కరోనా నేపథ్యంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రూ.10వేలు చొప్పున డిసెంబర్ వరకు ఇవ్వాలి. నూలు సబ్సిడీని పునరుద్ధరించాలి. కొన్ని నిబంధనలను మార్చి ప్రతి కార్మికుడికి సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలి. మరోసారి పరిశీలించి జిల్లావ్యాప్తంగా నేత కార్మికులందరికి జియోటాగ్ నెంబర్ ఇవ్వాలి. రైతు బంధు పథకంలాగా పెట్టుబడి సాయం కింద ప్రతి నేత కుటుంబానికి ఏడాదికి రూ.50 వేలు ఇవ్వాలి. చనిపోయిన నేత కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. జిల్లాలో ఉన్న చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా చూడాలి ’ అని కేసీఆర్‌ను కోరుతున్నారు.

-రాపోలు వీరమోహన్, యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి
![]()
మీ ప్రాంతంలో జరిగే కార్యక్రమాల వివరాలు, ఫొటోలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరు. వాటిని వెబ్‌సైట్ www.chenetamitra.com లో ఉంచడంతో పాటు చేనేతమిత్ర మాసపత్రికలో ప్రచురిస్తాం.
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

