చేనేత కుటుంబాలను ఆదుకోవాలి: జాతీయ చేనేత ఐక్యవేదిక ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్‌ వరప్రసాద్‌, మండల కన్వీనర్‌ నానాజీ

కరోనా లాక్‌డౌన్‌ వల్ల చేనేత కార్మికులు తయారుచేసిన పట్టు వస్త్రాలు ఇళ్లలోనే ఉండిపోయాయి. రవాణా సౌకర్యం లేక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో చేనేత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో చేనేత కుటుంబాలను ఆదుకోవాలని జాతీయ చేనేత ఐక్యవేదిక తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్‌ ఆండ్రా వరప్రసాద్‌, మండల కన్వీనర్‌ పసగడుగుల నానాజీ జూన్‌ 19వ తేదీన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ‘‘ కరోనా దెబ్బకు ఏపీలోని 13 జిల్లాలోని దాదాపు 2 లక్షల చేనేత కుటుంబాల ఉనికి ప్రశార్థకంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని చేనేత కుటుంబాలను ఆదుకోవాలి. చేనేతలు తయారుచేసిన వస్త్రాలకు వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం మార్కెంటింగ్‌ సౌకర్యం కల్పించాలి. వైఎస్సార్‌ నేతన్ననేస్తం పథకం వల్ల కొంతమంది అనర్హులు లబ్ధి పొందారు. విచారించి అర్హులకు న్యాయం చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ హామీ ఇచ్చారు. Zlatá Era

Follow us on social media

Related posts

Leave a Comment