యాగంటిలో పద్మశాలీయుల అన్నదాన సత్రం, కళ్యాణ మండప నిర్మాణానికి 50 సెంట్ల స్థలం మంజూరు చేయిస్తానని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హామీ ఇచ్చారు. నవంబర్ 22వ తేదీ కోవెలకుంట్లలో పద్మశాలీయుల కార్తీక వనభోజన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులస్థుల ఆత్మీయ సమావేశాలు, సన్మాన కార్యక్రమాల వల్ల ఫలానా ఊర్లో తమ కులస్థులు ఉన్నారని తెలియడం.. ఒకరికొకరు పరిచయం కావడం వల్ల బంధుత్వం ఏర్పడుతుందన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో అటు తెలంగాణ ఇటు ఏపీలో కొంతమంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరమన్నారు. తన నియోజకవర్గంలో చేనేత సమాజంలోని అర్హులందరికి సంక్షేమ పథకాలు వర్తించేలా చూస్తామన్నారు.
రైతన్న తర్వాతి స్థానం నేతన్నదే.. జింకా విజయలక్ష్మి

దేశంలో రైతన్న తర్వాతి స్థానం నేతన్నదేనని ఆంధప్రదేశ్ పద్మశాలీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ జింకా విజయలక్ష్మి అన్నారు. చేనేతల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. పద్మశాలీయుల వంశ చరిత్రను తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్పడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పాలన్నారు. గతంలో బీసీలందరికి కలిపి ఒకే కార్పొరేషన్ ఉండేదని, అయితే ప్రస్తుతం 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు ముందుకు వచ్చే యువతకు తన ప్రోత్సాహం ఎల్లపుడూ ఉంటుందన్నారు. అంతకుమునుపు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జింకా విజయలక్ష్మికి పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సన్మానించారు.
రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం అడ్‌హక్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బీసీ కులాలన్నింటికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రొద్దుటూరులోని పద్మశాలీయులను స్ఫూర్తిగా తీసుకుని కర్నూలులో కార్తీక వనభోజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామన్నారు.


కార్యక్రమంలో కర్నూలు పట్టణ పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ, కోశాధికారి కాంచానం బాలాజీ, కోవెలకుంట్ల పద్మశాలీ సంఘం అధ్యక్షులు రంగా సుధాకరుడు (ప్రభాకర్), కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షులు భీమునిపల్లె వెంకటసుబ్బయ్య, నంద్యాల పద్మశాలీ సంఘం అధ్యక్షులు గంజి వెంకటేశ్వర్లు, కార్యదర్శి గాజుల శంకర్, బనగానపల్లె పద్మశాలీ సంఘం అధ్యక్షులు సుబ్బరాయుడు, ఆళ్లగడ్డ పద్మశాలీ సంఘం అధ్యక్షులు కట్టా రామకృష్ణ, కోవెలకుంట్ల పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు సోమా రాజశేఖర్, సంఘ సభ్యులు రంగా వెంకటరత్నం, అభిమన్యు, మాకం వెంకటేశ్వర్లు, కొత్తపేట పద్మశాలీ సంఘం అధ్యక్షులు గోరంట్ల రమణ, నందివర్గం అధ్యక్షులు మెటికల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక వనభోజన కార్యక్రమం సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Zlatá Era
