చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామ శ్రీనివాస్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. శ్రీశైలక్షేత్రంలోని పద్మశాలి అన్నసత్రానికి రూ.10 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో ఈ నెల 26వ తేదీన అందజేశారు. అన్నసత్రంలో వాటర్ సంపు నిర్మాణం కోసం ఈ డబ్బును వినియోగించనున్నారు. ఈ సందర్భంగా రామశ్రీనివాస్కు పలువురు పద్మశాలీయులు అభినందనలు తెలిపారు.

వరంగల్ జిల్లా రామన్నపేటలో జన్మించిన రామ శ్రీనివాస్ గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేవాలయాలకు ఆర్థిక సాయం కూడా చేశారు. ‘మోక్షారామం ఫౌండేషన్’ను స్థాపించి రామన్నపేటలో నేటికీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.



అన్న గారు 🙏మాలాటి పేదవారికి ఇవండీ అన్న మీ పేరు చిరకాలం గుర్తుంచుకుంటాం మహేష్ పద్మశాలి నిజామాబాదు