చదువుకు డబ్బు అవరోధం కాకూడదు: ఐఏఎస్‌ అధికారి నరహరి

‘చదువుకు డబ్బు అవరోధం కాకూడదు. ప్రతిభ గల విద్యార్థిని చదివించే ఆర్థిక స్తోమత తల్లిదండ్రులకు లేనపుడు సమాజమే అండగా నిలిచి ప్రోత్సహించాలి. సివిల్‌ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం నాపా సహకారంతో ప్రణాళిక రూపొందుతోంది. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు, సమాజం వివక్ష చూపకూడదు. వాళ్ల అభ్యున్నతికి చేనేత, కుల సంఘాలు పనిచేయాలి. ఏపీలో విస్తరిస్తోన్న వెపాకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి’ అని ఐఏఎస్‌ అధికారి నరహరి అన్నారు. ప్రస్తుతం వీరు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌ వీవర్స్ అండ్‌ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఏపీ వెపా) సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 10.30 గంటల వరకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన పాల్గొన్నారు. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల చేనేత వర్గాలతో వెపా రాష్ట్ర  కన్వీనర్ కే వెంకటశేషయ్య ఈ కాన్ఫరెన్సు ఏర్పాటు చేశారు. వెపా నెల్లూరు జిల్లా అధ్యక్షులు సజ్జా వెంకట సురేష్‌ సంఘం ఆవిర్భావం, లక్ష్యాలు, సాధించిన పురోగతి గురించి అవగాహన కల్పించారు.

రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్‌ మాట్లాడుతూ అన్ని చేనేత వర్గాలను ఏకంచేసి ఒకతాటిపైకి తేవడం అభినందనీయమన్నారు. ప్రముఖ న్యాయవాది వైకే మాట్లాడుతూ చేనేత సమాజం నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్నారు. కేవలం మగ్గం ఉన్న వారికి మాత్రమే కాకుండా చేనేత వృత్తిపై ఆధారపడిన వారందరికి ప్రభుత్వం ఏడాదికి రూ. 24వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

డాక్టర్‌ సమతం మహేష్‌ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి యువత కూడా ముందుకువచ్చి చురుకుగా పనిచేయాలని సూచించారు. డాక్టర్‌ వానపల్లి వెంకటరావు ప్రతి జిల్లాలో చేనేత జాతరలు నిర్వహించాలన్నారు. డాక్టర్‌ హేమంత్‌ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి అందరి సహకారం అవసరమని, తనవంతు సహకారం ఎల్లపుడూ ఉంటుందన్నారు. మన్నెం సతీష్‌ మాట్లాడుతూ సంఘం గ్రామ, మండల స్థాయి నుంచి సంఘం బలోపేతం కావాలని కోరారు.

కారెళ్ల గణపతి రావు మాట్లాడుతూ చేనేత సమాజం బలోపేతానికి చేనేత వర్గాలన్ని కలిసి రావాలన్నారు. కరెళ్ల రామ మనోహర రజినీకాంత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వెపా విస్తరిస్తుండడం శుభపరిణామన్నారు.

బండారు ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి క్రమశిక్షణతో కూడిన నాయకత్వం అవసరమన్నారు. మంచు చంద్రయ్య మాట్లాడుతూ వెపాకు తన సహకారం తప్పక ఉంటుందన్నారు. తేలప్రోలు వాసుదేవమూర్తి మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కులసంఘాల తోడ్పాటు కూడా అవసరమన్నారు.

దుర్గా రమేష్‌ మాట్లాడుతూ సంఘాల్లో మహిళలకూ ప్రాధాన్యం ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్సులకు వారికి కూడా ఆహ్వానించాలని సూచించారు. యాక్టివిటీ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో సంఘం ఏర్పాటు, బలోపేతానికి కృషి చేస్తానన్నారు పొలిశెట్టి మల్లిబాబు మాట్లాడుతూ నిరంతరం చేనేత సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు అవసరమన్నారు. నాలి అప్పారావు (విజయనగరం) మాట్లాడుతూ చేనేత వర్గాల సహకారంతో వెపా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

మేరువ వెంకటేశ్వర్లు (బెంగళూరు) మాట్లాడుతూ వెపా ‘వెపన్‌’లాగా దూసుకెళ్తుందని, లక్ష్యాలను కూడా చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవి మాట్లాడుతూ చేనేత వర్గాలను ఏకతాటిపైకి తీసుకువస్తుండడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మాడిశెట్టి శివశంకరయ్య మాట్లాడుతూ చేనేతల సమస్యలను గ్రామస్థాయి నుంచి పరిష్కరించుకుంటూ రావాలన్నారు. పనిచేసే వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్నారు.

కాన్ఫరెన్సులో పాల్గొన్న వారంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గుంటూరు జిల్లా బాధ్యులు, చేనేత కవి రాపోలు జగన్‌, తెలంగాణ రాష్ట్ర సచివాలయ కార్యదర్శి యాదగిరి తిరందాస్‌, నెల్లూరు డ్వామా పీడీ మద్దూరి తిరుపతయ్య, డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌, చిలువేరు మార్కండేయ, సిద్దాని గంగాధర్‌, హేమ సుందర్‌, నీలంశెట్టి సత్యప్రసాద్‌,  పంపాన రమణ, కాసా వెంకటరమణ మూర్తి, శ్రీనివాసరావు, త్రినాథ్‌, దేవేంద్రనాథ్‌, శీరపు అప్పల నారాయణ, మందుల మోహన్‌ రావు, మోటుపల్లి తారకరామారావు, చింతగింజల గాయత్రి, నీలంశెట్టి శ్రీనివాస్‌, డా. బీపీఎస్‌ కళ్యాణి, మాచర్ల పాపారావు, శీలం మల్లికార్జున, నెల్లూరు జిల్లా నుంచి బూదాటి కోటేశ్వరరావు, తాటిపర్తి వెంకటేశ్వర్లు, కొనిశెట్టి లక్ష్మయ్య, కోడూరు శివకుమార్‌, మాధవి లక్ష్మి, పులి సురేష్‌ బాబు, దివి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

చివరగా తాటిపర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేనేతలకు చాలా సందర్భాల్లో అండగా నిలిచిన బొమ్మన రాజ్‌ అకాల మరణానికి సంతాపం తెలిపారు. అలాగే వీవర్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు శీరం శ్రీరామచంద్రమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వందన సమర్పణ చేశారు.

WhatsApp: 83338 71117
email : chenetamitra@gmail.com
facebook: Chenetamitra Maasapatrika 

 

Záloha Valnex

Follow us on social media

Related posts

Leave a Comment