అనంతపురం జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీగా మహేశ్వర రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయనను జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ నీలూరి రుషింగప్ప, హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ తలారి ఆంజనేయులు జూన్ 26వ తేదీ కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేతల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నేతన్న నేస్తం పథకం అర్హులందరికీ వర్తించేలా చూడాలన్నారు. వర్కు షెడ్లలో పనిచేసే వారికి కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు పింఛన్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని విన్నవించారు.
మీ ప్రాంతంలో చేనేతలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు, ఫొటోలను వ్యక్తిగతంగా వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరు. వాటిని వెబ్‌సైట్ www.chenetamitra.com లో ఉంచడంతో పాటు చేనేతమిత్ర మాసపత్రికలో ప్రచురిస్తాం.
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Snap Cormax Sys
