చేనేతమిత్ర ప్రత్యేకతలివి.
పాఠకుల అభిరుచికి అనుగుణంగా శీర్షికలు..
విద్య : వివిధ విద్యాసంస్థలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశాల ప్రకటనలు, సిలబస్, విద్యా విధానంలో వస్తున్న మార్పులు, నిపుణుల అభిప్రాయాలను పొందుపరుస్తాం.
వైద్యం : వివిధ రకాల జబ్బులపై ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పించడం, వ్యాధి లక్షణాలు, నివారణ, నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం.
ఉద్యోగం : నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియపరుస్తాం.
ఉపాధి : స్వయం ఉపాధి కోర్సులపై అవగాహన, కోర్సులకు ఉన్న డిమాండ్‌పై నిపుణుల అభిప్రాయాలు.
ప్రతిభ : వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు, యువతీ యువకుల సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తాం.
సేవా : అన్నింటిలోకెల్లా సేవాగుణం మిన్న. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసిన వారి వివరాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు నిర్వహిస్తున్న వారి వివరాలను తెలియపర్చడం కోసం.
పదవి : సన్మాన గ్రహీతలు, పదోన్నతులు పొందినవారి సమాచారం పొందుపరుస్తాం.
అతిథి, పరిచయం : ప్రముఖలు, ఉద్యోగులు, వ్యాపారులను పరిచయం కార్యక్రమం.
నివాళి : సంఘానికి సేవ చేసిన వారిని స్మరించుకోవడం – వారి సేవలను గుర్తు చేయడం
తెలుసుకుందాం : ప్రజలకు తెలియని విషయాలపై అవగాహన కల్పించడం.
ఇంకా మరెన్నో..
పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారం, చట్టాలు – న్యాయ సలహాలు, సంక్షేమ పథకాలు, సాహిత్యం, సౌందర్య చిట్కాలు, నీతి కథల కోసం ప్రత్యేక విభాగాలను కేటాయించాం. బ్రోచర్లు, పేపర్ క్లిప్పింగుల కోసం మరో విభాగం ఏర్పాటు చేశాం. పాఠకులు సమాచారం పంపడానికి, అభిప్రాయాలు తెలపడానికి వీలుగా వెసులుబాటు కల్పించాం. వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం యాప్‌ల ద్వారా మా వద్ద ఉన్న సమాచారాన్నివీలైనంత ఎక్కువ మందికి చేరవేస్తున్నాం.
– చేనేతమిత్ర వెంకటశివయ్య
M.A.(English)., B.Ed.,
చీఫ్ ఎడిటర్, చేనేతమిత్ర మాస పత్రిక Tau Portfolix


