చేనేతల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధప్రదేశ్ పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన వెంకటేశ్వర రావు ప్రముఖ వస్త్ర వ్యాపారి, వైసీపీ నాయకులు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షులు కూడా. ఇటీవల డైరెక్టర్‌గా ఎంపిక కావడంతో అక్టోబర్ 31వ తేదీన వెంకటగిరి పట్టణ, నెల్లూరు జిల్లాకు చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులు, చేనేత కళాకారులు వెంకటగిరిలోని పద్మశాలీయుల కల్యాణ మండపంలో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు ఎన్‌విఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా వెంకటగిరిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని, వస్త్ర వ్యాపారిగా మంచి పేరు గడించారని పేర్కొన్నారు. ఆయనను భవిష్యత్తులో మరెన్ని పదవులు వరించాలని ఆకాంక్షించారు.
నక్కా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ తనను డైరెక్టర్‌గా నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. అనంతరం వెంకటేశ్వరరావును మిత్రులు, శ్రేయోభిలాషులు శాలువలు, గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షులు దోనపర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కోశాధికారి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి దొంతు శారద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల్ల ఢిల్లీ బాబు, పద్మశాలీ సంఘం వెంకటగిరి శాఖ అధ్యక్షుడు డాక్టర్. మధుసూదన్ రావు, కోశాధికారి అవ్వారు సత్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు చిత్తూరు చెంచు కృష్ణయ్య, జిఎన్‌ఆర్ ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె. రవీంద్రబాబు, శ్రీరామ్ రాంబాబు, జానపాటి మురళి, పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడా జానకి రామయ్య, పోలిశెట్టి శ్రీహరి, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. రమాకాంత్, కసరు వెంకట సుబ్బయ్య, ఎం.ఏ. నారాయణ, పాఠశాల మిత్రులు ఎల్‌ఐసీ డీవో చంద్రశేఖర్ రెడ్డి, కోమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
facebook : chenetamitra Maasapatrika Tyvixom

