
ప్రకాశం జిల్లాకు చెందిన అవ్వారు వెంకటేశ్ బాబు, ఆయన అన్న అవ్వారు హరికృష్ణ కలిసి మే 23వ తేదీ తమ జిల్లా కేంద్రంలో నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 10 మంది వృద్ధులు, పేదలకు రూ. వెయ్యి విలువ చేసే 10 కిట్లను (కందిపప్పు 2 కేజీలు, గోధుమపిండి, చింతపండు, వంటనూనె, ఇడ్లిరవ్వ, మినపగుండ్లు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ కిలో చొప్పున, చక్కెర అర కిలో, సంతూర్ సోప్స్ – 2, రిన్ సబ్బు – 1, బిస్కెట్ ప్యాకెట్లు – 2) కొత్తపాలెం, పేరాల శివాలయం వెనుక, నవాబోపెట్ ప్రాంతాల్లో అందజేశారు. కార్యక్రమంలో ఆకురాతి రేవంత్, వై రామారావు, వై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

