అనాథ శవానికి అంత్యక్రియలు

అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు విశాఖపట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్‌. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారు.  

అనాథ శవానికి అంత్యక్రియలు
విశాఖపట్నం రామకృష్ణా జంక్షన్‌లో ఓ అనాథ శవానికి మాజీ కార్పొరేటర్‌, సాయిపూజ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు వానపల్లి రవి కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. విచారణ అనంతరం పోలీసులు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మానవతను చాటుకుంటున్న రవికుమార్‌ను పలువురు అభినందిస్తున్నారు.

నిత్యావసరాల పంపిణీ

కప్పరాడకు చెందిన శ్రీదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా ఉందని తెలియడంతో వానపల్లి రవికుమార్‌ ఆమెకు డిసెంబర్‌ 15వ తేదీన ఫౌండేషన్‌ కార్యాలయంలో నిత్యావసర సరుకులు అందజేశారు. దీంతో జి. హెచ్‌. పాఠశాల పూర్వ విద్యార్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కార్యదర్శి సారిపల్లి మహేష్‌, అయంకల శ్రీనివాస్‌, నిమ్మకాయల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. Snap Cormax Sys

Follow us on social media

Related posts

Leave a Comment