అన్నదానం, పుస్తకాల పంపిణీ

దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఎఎన్‌ఆర్‌ నగర్‌లోని షిరిడీ సాయిబాబా మందిరం వద్ద అక్టోబర్‌ 22వ తేదీ సాయి పూజా ఫౌండేషన్‌ చైర్మన్‌, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌ సుమారు 600 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కనకల శ్రీనివాస్‌,శ్రీ దేవి, లక్ష్మి, చవాకుల కృష్ణ, శ్రీనివాస్‌, బలగ కృష్ణ, రాజు, రెడ్డి పాల్గొన్నారు.
పుస్తకాల పంపిణీ

గ్రేటర్‌ విశాఖ 31వ వార్డులోని పేద విద్యార్థులకు సాయి పూజా ఫౌండేషన్‌ చైర్మన్‌, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌ అక్టోబర్‌ 22వ తేదీ నోట్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. 25 మంది విద్యార్థులకు రూ 25వేలు విలువ చేసి పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్యదర్శి సారిపల్లి మహేష్‌, కృష్ణ, పాన్‌షాప్‌ కృష్ణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. Ampla Tesouròs

Follow us on social media

Related posts

Leave a Comment