జాతీయ చేనేత ఐక్య వేదిక (తెలంగాణ) రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్‌ ‌ప్రస్థానం..

సమాజానికి సేవచేయాలన్న తపన ఆయనది. తనకున్న సమయంలో కొంత సమయాన్ని ప్రజల కోసం కేటాయించాలనుకున్నారు. ఆ ఆకాంక్షే ఆయనను తొలుత వార్డు మెంబర్‌గా గెలిపించింది. ధర్మకర్తగా సుదీర్ఘకాలం కొనసాగిన అనుభవం.. ఆయనకు తర్వాత కాలంలో ఎన్నో పదవులు వరించేందుకు దోహదపడింది. ఇటు వర్తక సమాజానికి, అటు పద్మశాలీ సమాజానికి విశేష సేవలందించి.. ప్రస్తుతం జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయనే రాపోలు వీరమోహన్‌. ఆయన పుట్టిన రోజు (మే 7) సందర్భంగా రాపోలు వీరమోహన్‌ ‌కుటుంబనేపథ్యం చేనేతమిత్ర మాసపత్రిక పాఠకుల కోసం.. 

చేనేతమిత్ర ‌ప్రతినిధి : రాపోలు వీర మోహన్‌ ‌తల్లిదండ్రులు గౌరమ్మ, రాపోలు గంగయ్య. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమారై. అందరిలోకి పెద్ద అయిన వీర మోహన్‌ ‌తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో జన్మించారు. పదో తరగతి వరకు సొంతూరులోనే చదువుకున్నారు. రామన్నపేట మండల కేంద్రంలో ఇంటర్మీడియట్‌ ‌పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని బద్రుకా కాలేజీలో బికాం (ఉస్మానియా యూనివర్సిటీ), ఆ తర్వాత సాహిత్యంలో కాకతీయ విశ్వ విద్యాలయం (వరంగల్‌) ‌ ‌నుంచి పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌పట్టా పొందారు.

వార్డు మెంబర్‌ నుంచి..చేనేత ఐక్యవేదిక అధ్యక్షులుదాకా..

24 సంవత్సరాల వయసులోనే స్వగ్రామం సిరిపురం మేజర్‌ ‌గ్రామ పంచాయతీకి రెండు సార్లు వార్డ్ ‌మెంబర్‌గా ఎన్నికయ్యారు. గ్రామంలోని శ్రీ సీతారామాలయం ధర్మకర్తగా వరుసగా 12 సంవత్సరాలు కొనసాగారు. ఎనిమిదేళ్ల పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ‌చేనేత వర్తక సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఐదు సంవత్సరాలు, తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా మూడు సంవత్సరాలు సేవలందించారు. గత 20 సంవత్సరాలుగా పద్మశాలి సమాజానికి విశేష సేవలందించిన రాపోలు వీరమోహన్‌ ‌ప్రస్తుతం జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

రాపోలు కుటుంబం..

రాపోలు వీరమోహన్‌ ‌భార్య పేరు శ్రీమతి రాపోలు వాణి, గృహిణి. రాపోలు దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రాపోలు ఉదయ్‌ ‌మోహన్‌ ‌హైదరాబాద్‌లో ఐసీఐసీఐ బ్యాంకు మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండో అబ్బాయి రాపోలు సాయి మోహన్‌ ‌హైదరాబాద్‌ ‌జన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌.

ఇవి కూడా చదవండి..

చేనేతల కష్టాలు పట్టవా? పాలకులను సూటిగా ప్రశ్నిస్తున్న జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ అధ్యక్షులు రాపోలు వీర మోహన్‌  https://chenetamitra.com/2022/11/25/rapolu-veera-mohan-demands-the-govt-to-solve-the-weavers-problems/

 

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

 

Baltic Capital

Follow us on social media

Related posts

Leave a Comment