పదవిలో ఉన్నా, లేకున్నా బుట్టా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నిత్యం సేవలందుతాయని కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ప్రధానంగా విద్యా, వైద్య రంగంలో తమ సేవలు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గణితం, ఆంగ్లంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఉపాధ్యాయులు గణితం, ఆంగ్లంపై విద్యార్థులకు ఉన్న భయాన్ని పొగొట్టే రీతిలో బోధన ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ ద్వారా తమ సేవలను మండల స్థాయికి తీసుకెళ్తామన్నారు. కర్నూలులో ఎస్సీ బీసీ బాలికల వసతి గృహంలో ఇటీవల బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు గణితం,ఆంగ్లంలో మెళకువలు నేర్పారు. శిక్షణ ముగింపు కార్యక్రమానికి బుట్టా రేణుక ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్లు శైలజ, ప్రమీలా రాణి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ భారతి, బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, సమన్వయకర్త చరిత పాల్గొన్నారు. Ziskovum

