చదువులో చురుగ్గా ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కట్టలేని వారికి బుట్టా ఫౌండేషన్ బాసటగా నిలిచింది. వైసీపీ కార్యకర్త సుల్తానా కూతురు షేక్ సుహాన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 98% మార్కులు సాధించారు. రెండో సంవత్సరం పూర్తి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో తమ ఫౌండేషన్ ద్వారా మాజీ ఎంపీ బుట్టా రేణుక రూ. 25 వేలు అందజేశారు. అలాగే మరో విద్యార్థిని వీజీ సాయి రోజా రాణి తల్లి ఇటీవలే క్యాన్సర్‌తో చనిపోయారు. తండ్రి ఆర్థిక ఇబ్బందులలో ఉండడం వల్ల సాయి రోజారాణి చదువుకు రూ.10 వేలు అందజేశారు. గూడూరుకు చెందిన రాజ్ కుమార్‌కు డీఎస్సీ కోచింగ్ తీసుకునేందుకు రూ. 5 వేలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధన కోసం ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే ఆశయం నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ చైర్మన్ బుట్ట నీలకంఠం, మేనేజర్ రాజేష్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. Κεντρο Luxorion
పేద విద్యార్థులకు బుట్టా రేణుక ఆర్థిక సాయం
