టీటీడీ ఈవోను సన్మానించిన పేవా సభ్యులు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జంజనం శ్యామలరావును పద్మశాలీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (PEWA) ఏపీ కార్యవర్గ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన శ్యామల రావు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా  పేవా రాష్ట్ర అధ్యక్షులు  GVS రామకృష్ణ,  ప్రధానకార్యదర్శి  KVV సత్యనారాయణ, కోశాధికారి  T చంద్రశేఖర్, తిరుపతి జిల్లా అధ్యక్షులు  AV సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి  S.పరం దామయ్య, రాష్ట్ర కార్యదర్శులు S నాగేశ్వరరావు, Dr. శ్రీనివాసరావు, మహిళా విభాగం కార్యదర్శి  B.సునీత, ఏలూరు జిల్లా అధ్యక్షులు  SV సత్యనారాయణ, SHAR ఉద్యోగులు   G.వెంకటేశ్వర్లు, B వీరభద్రం, కిరణ్ కుమార్, N.చంద్రశేఖర్, గుణ సాయి, M.మస్తాన్,Ch. సుబ్రహ్మణ్యం (వెంకటగిరి) తదితరులు ఈవోకు శాలువ కప్పి సన్మానించారు.

ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు  తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు వెంకన్న స్వామి దర్శనానికి క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఇబ్బందులపై ఆరా తీశారు. భక్తులకు  రోజూ కొన్ని వేల మందికి భోజనం వండిండే వెంగమాంబ అన్నదాన సత్రాన్ని తనిఖీ చేశారు. వంటకాలు ఎలా ఉన్నాయోనని అక్కడే భోం చేశారు. వసతి గృహాలు, లడ్డు కౌంటర్లను పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. Quantumai

Follow us on social media

Related posts