చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం (టీపీయుఎస్) ఇటీవల వరంగల్ జిల్లా హన్మకొండ జడ్పీ సమావేశ భవనంలో పద్మశాలీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పద్మశాలీ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టీపీయుఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..పద్మశాలీయులు, పద్మశాలీ ఉద్యోగులు సంఘటితంగా ఉండి ఐక్యతను చాటాలని సూచించారు.టీపీయుఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కోడం రవి ప్రకాష్ కొనసాగించిన ఈ కార్యక్రమంలో సంఘం సొంత భవనానికి చేయూత నిచ్చిన పద్మశాలీ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథులుగా జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు హాజరుకాగా.. అతిథులుగా కూరపాటి వెంకటనారాయణ , ఆళ్ల రాఘవేందర్, రవి కిరణ్, గొట్టిముక్కల సదానందం, కుసుమ సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శిరందాసు యాదగిరేందర్, శేషగిరి, చిలుక శ్రీనివాస్, పిట్ట ఉమాదేవి, కొండబత్తుల రాజమౌళి, చింతకింది శ్రీనివాస్, కరుణశ్రీ, వి.శ్రీనివాస్, సిరిపురం శేఖర్, గుర్రపు రాజమౌళి, దేవులపల్లి సాయి రాజు, కూచన రాజు, మేన వాణిశ్రీ, నల్ల మాధవి, పెద్ద ఎత్తున పద్మశాలీ కుల బాంధవులు, అధికారులు, ఉద్యోగులు విచ్చేశారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు అధిక సంఖ్యలో హాజరయిన పద్మశాలీయులందరికి ఈగ వెంకటేశ్వర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





“ఆత్మీయ సమ్మేళనాలతో బంధాలు బలోపేతమవుతాయి”
– ఈగ వెంకటేశ్వర్లు

నల్లగొండ జిల్లా కాకతీయ ఎన్‌క్లేవ్‌లో ఈ నెల 18వ తేదీ నిర్వహించిన పద్మశాలీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా టీపీయుఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శిరందాసు యాదగిరేందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాంత్రిక జీవనం గడుపుతోన్న ప్రస్తుత రోజుల్లో.. సంఘంలోని ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని, అందరూ కలిసి మెలిసి ఉంటూ.. సఖ్యతతో కూడిన జీవనం కొనసాగించాలన్నదే ఆత్మీయ సమ్మేళనం ముఖ్యోద్దేశమని పేర్కొన్నారు. పద్మశాలీయులు తమ ఉనికిని చాటుకోడానికి ఇలాంటి సమ్మేళనాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ..కొత్తగా స్నేహ సంబంధాలు ఏర్పడడం, ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయన్నారు. కార్యక్రమంలో టీపీయుఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు గంజి వెంకట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యేశాల విశ్వ కుమార్, కార్యవర్గ సభ్యులు వన్నల్ శ్రీనివాస్, మిర్యాల వేంకటపతి, నల్ల శ్రీనివాస్, సంగిశెట్టి హరికృష్ణ, రాపోలు రవి, గంజి వెంకన్న, గంజి నవీన్ కుమార్, తిరందాసు సంతోష్ కుమార్, మిర్యాల శ్రీనివాస్, వైద్యులు, కులబాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![]()
చేనేతమిత్ర మాసపత్రిక Lithuanian Invest

