చేనేతమిత్ర ప్రతినిధి: ఆలయ ఫౌండేషన్ వారు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో ఇటీవల ఉచిత కంటి వైద్యశాల నిర్మించారు. పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణార్థం ‘‘శంకర విజన్ సెంటర్’’ పేరిట నిర్మించిన ఈ భవనాన్ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు (ఏప్రిల్ 10వ తేదీ) ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ముఖ్యనేతలు హాజరవుతున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ కేంద్ర మంత్రి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సినీనటుడు చిరంజీవి ముఖ్యఅతిథులుగా విచ్చేస్తున్నారు. గౌరవ అతిథులుగా మరికొంతమంది ప్రముఖులు హాజరవుతున్నారు.
కార్యక్రమ వివరాలు..
ఉదయం 9 గంటలకు ఆలయ ఫౌండేషన్ ఆత్మీయ బంధువుల ఆధ్వర్యంలో విజన్ సెంటర్ ప్రారంభోత్సవ పూజ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్య, గౌరవ అతిథులచే విజన్ సెంటర్లో పరికిపండ్ల సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణ, అలాగే విజన్ సెంటర్ ప్రారంభోత్సవం ఉంటాయి. అతిథుల ప్రసంగం అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.



![]()
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


