శిక్షణకు ఎంపికయిన వారికి కిట్ల పంపిణీ

చేనేతమిత్ర ప్రతినిధి: కర్నూలు నగరం బిర్లా కాంపౌండ్‌లో ఉచిత కుట్టు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణకు ఎంపికయిన 30 మంది యువతులు, మహిళలకు ఈనెల 7వ తేదీ రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీ నారాయణ, జిల్లా విజిలెన్స్ ‌మానిటరింగ్‌ ‌సభ్యులు ఊట్ల రమేష్‌ ‌బాబు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఇంట్లో ఒకరి ఆదాయంతో కుటుంబం గడవడం కష్టంగా ఉన్న ప్రస్తుత సమయంలో మహిళలు స్వయం ఉపాధిని ఎంచుకుని రాణించాలని ఆకాంక్షించారు. శిక్షణ పూర్తయిన తర్వాత తమ కాళ్లమీద తాము నిలబడడంతో పాటు మరికొంత మందికి సాయపడాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం నిర్వాహకులు వెంకటేశ్వర్లు, అధ్యాపకులు ఫాతిమ, సుశీల, తదితరులు పాల్గొన్నారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Immediate Edge

Follow us on social media

Related posts

Leave a Comment