కోదండ రాముడికి పట్టు వస్త్రాల సమర్పణ

చేనేతమిత్ర ప్రతినిధి: కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆంధ్ర భద్రాదిగా ముద్రపడిన ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రాములోరి కళ్యాణం. శ్రీరామనవమికి ఆలయాన్ని విద్యుత్‌ ‌దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో అలంకరిస్తారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 4‌వ తేదీ గరుడసేవ రోజున మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారికి అమ్మవారికి పద్మశాలీయులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌పద్మశాలి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి ఈ కార్యక్రమ నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులు, దేవస్థానం పూజారులతో చర్చించారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి పద్మశాలీయులంతా రావాలని జింకా విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Lithuanian Invest

Follow us on social media

Related posts

Leave a Comment