తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం 2023 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కార్యదర్శి కె.సురేందర్ మోహన్ సోమవారం 4.30గంటలకు క్యాలెండర్‌ను ఆవిష్కరించి కులస్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీ బంధు మిత్రులంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత అన్ని రంగాల్లో రాణించి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం ఎన్నో ప్రయోజక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, కులస్థులకు పద్మరత్న అవార్డులు, పేద పద్మశాలీ కులస్థులకు వైద్యం కోసం, అలాగే ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా ఆదుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులయిన ప్రతి చేనేత కుటుంబానికి వర్తించేందుకు సంఘం నాయకులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి, ఉపాధ్యక్షులు ఇప్పకాయల విష్ణుమూర్తి, సంస్థాగత కార్యదర్శి శిరందాసు యాదగిరేందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బాసబత్తిని రాజేశం ప్రధాన కార్యదర్శి పున్న శ్రీనివాస్, కోశాధికారి పున్న ప్రవీణ్, కుర్రె యోగెందర్,వెంకట్ రావు, మామిడాల రవికుమార్, చింతకింది సుజాత, లక్ష్మీపతి, ఆడెపు శ్రీనివాస్, బోగ శ్రీనివాస్, కూర సత్యనారాయణ, సంగిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

![]()
చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Best Canada online casino


