లీజుకు అనంతపురం పద్మశాలీ కళ్యాణ మండలం

అనంతపురం: అనంతపురం నగరం తపోవనంలోని పద్మశాలీ కళ్యాణ మండపం లీజు గడువు ఈ డిసెంబర్‌ మాసంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అనంతపురం నగర పద్మశాలీ సంఘ సభ్యులు సమావేశమై.. కళ్యాణ మండపాన్ని తిరిగి లీజుకు ఇచ్చే అంశాన్ని చర్చించారు. జనవరి 2023 నుంచి డిసెంబరు 2025 వరకు లీజుకు ఇవ్వాలని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించి, తేదీని ఖరారు చేశారు. కళ్యాణ మండపాన్ని లీజుకు తీసుకునేందుకు ఆసక్తి చూపే వ్యక్తులు ఈనెల 27వ తేదీ నిర్వహించే లీజు పాటలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

షరతులు, నిబంధనలు..
1) బిడ్‌ మొత్తం ధర రూ.12 లక్షలు 2) లీజు కాలపరిమితి మూడు సంవత్సరాలు 3) లీజుకు తీసుకున్న వ్యక్తి పద్మశాలీయుల పెళ్లికి రూ.16వేలు, నిశ్చితార్థం లాంటి కార్యక్రమాలకు రూ. 8 వేలు మాత్రమే తీసుకోవాలి. 4) సంఘ కార్యక్రమాల నిర్వహణకు కళ్యాణ మండపాన్ని అన్ని సదుపాయాలతో ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. 5) లీజు పాటలో కల్యాణ మండపాన్ని దక్కించుకున్న హెచ్చుపాటదారుడు మొత్తం డబ్బులో 1/4 వ వంతును 10 రోజులలోగా, మిగిలిన మొత్తాన్ని 30 రోజులలోగా సంఘానికి చెల్లించాల్సి ఉంటుంది. Online games casino canada

Follow us on social media

Related posts

Leave a Comment