శ్రీకాకుళంలో చేనేతల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి, అర్హులైందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పోతుల సునీత హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలోని పట్టుశాలి భవన్లో నవంబర్ 28వ తేదీ నిర్వహించిన చేనేతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు నాలుగు వందల మంది చేనేత కుల, వృత్తి, ఉద్యమ, సహకార సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కార్పొరేషన్ డైరెక్టర్ బి లలితా రాణి జ్యోతి ప్రజ్వలనతో సమావేశం మొదలైంది. సమావేశం ప్రారంభంలో ఏపీ వీవర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్ కె.వి.శేషయ్య నేత మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి, చేనేత నాయకులు కర్ర రవి మాతృమూర్తి వీరమ్మ, పిల్లలమర్రి నాగేశ్వరరావు సతీమణి హైమావతి మృతికి సంతాపం తెలిపారు. సభికులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ చేనేత కుల, వృత్తి, కార్మిక, ఉద్యమ సంఘాల ఐక్యత ` ఫెడరేషన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి మాట్లాడారు. చేనేతలు ఎవరికి వారు ఒంటరిగా ఉంటే సరిపోదని, అన్ని చేనేత కులాలు కలిసి ఉంటేనే బలంగా ఉంటామని పేర్కొన్నారు. సమావేశ నిర్వహణ కన్వీనర్ గుంటుకు చంద్రశేఖర్ సమావేశం సజావుగా సాగేందుకు వ్యాఖ్యానం చేస్తూ, కమిటీలను పర్యవేక్షించారు. వీవర్స్ ఫెడరేషన్ నాయకులు పప్పు దుర్గారమేష్, వీవర్స్ ఫెడరేషన్ కన్వీనర్ కరెళ్ల రామ్ మనోహర్ రజనీకాంత్ సమావేశాన్ని సమన్వయం చేశారు. వీవర్స్ ఫెడరేషన్ నాయకులు కరెళ్ల గణపతి రావు మాట్లాడుతూ సమాజంలో చేనేతల కన్నా తక్కువ జనాభా గల ఇతర కులాల వారు ఐక్యంగా ముందుకు సాగుతూ అన్ని రకాల సదుపాయాలను పొందుతున్నారని గుర్తు చేశారు.
కార్పొరేషన్ డైరెక్టర్ దొడ్డి రాంబాబు మాట్లాడుతూ చేనేత కులాలు విడివిడిగా కాకుండా, ఏకతాటిపై నడవాలన్నారు.వీవర్స్ ఫెడరేషన్ కన్వీనర్ చింతా శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులాల జనాభా గణన ఆవశ్యకతను విశదీకరించారు. కర్నూలు జిల్లా నందవరంలో నిర్వహించిన చేనేతల రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత రాష్ట్రంలోని అన్ని చేనేత కులాల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఫెడరేషన్ ఆవశ్యకతను గుర్తించి స్వాగతిస్తున్నారని చెప్పారు.
మంచు కృష్ణారావు చేనేత జాతీయోద్యమ నాయకులు ప్రగడ కోటయ్యకు ఘన నివాళి అర్పించారు. పొందూరు మాజీ ఎంపీటీసీ సాయి కుమార్ మాట్లాడుతూ చేనేతలలో ఐక్యతాలోపం వల్లే చాలా రకాలుగా నష్టపోయామని, ఫెడరేషన్ ఏర్పాటు ద్వారా సమన్యాయం సాధించుకోవచ్చన్నారు.
డాక్టర్ సమతం రమణ మహేష్ ఫెడరేషన్ ఏర్పాటు గురించి, ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు. ఛాయా ఓంకారయ్య మాట్లాడుతూ దివంగత మాచాని సోమప్ప, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ సీబీ అజయ్ కుమార్ మాట్లాడుతూ చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఫెడరేషన్ బలోపేతానికి తన సహాయసహకారాలు ఉంటాయన్నారు. సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మల దాసు మాట్లాడుతూ చేనేతల ఐక్యత, అ భ్యున్నతికి అత్యున్నత స్థాయిలో వున్న చేనేత వర్గాలకు చెందిన అధికారులు సహకరించాలని కోరారు.
గుత్తి త్యాగరాజు, బొల్ల లలితారాణి మాట్లాడుతూ చేనేతలు ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమని, ఫెడరేషన్ బలోపేతానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెడ్లపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్నా చేనేత సమాజం చాలా విధాలుగా నష్టపోతోందని, చేనేతలంతా ఏకమై తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. డాక్టర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ చేనేత ఉన్నతాధికారులు, ఉద్యోగులు చేనేత సమాజాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ స్ఫూర్తినివ్వాలని పిలుపునిచ్చారు. నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్త చేనేత సమాజం ఏకమై ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ లతో కలిసి సమస్త రంగాల్లో సమన్యాయం సాధించుకోవాలని సందేశమిచ్చారు.
కె.వి.శేషయ్య నేత మాట్లాడుతూ చేనేతలు చైతన్యమైతేనే విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రొఫెసర్ వానపల్లి వెంకట్రావు మాట్లాడుతూ చేనేత సమాజంలోని మేధావులంతా ఫెడరేషన్ కు వెన్నుదన్నుగా నిలిచి ముందుకు నడిపించాలని కోరారు. జగ్గారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫెడరేషన్ నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి, చేనేతరంగ అభివృద్ధికి అన్నివేళలా సిద్ధమన్నారు.
పప్పు రాజారావు మాట్లాడుతూ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలని, నేత నేయడం లాభసాటి వృత్తి కావాలని ఆకాంక్షించారు. వాసా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ చేనేత కులాలన్నీ ఫెడరేషన్లో భాగమై భవిష్యత్ తరాలకు భరోసా కలిగించాలని పిలుపునిచ్చారు. గుంటముక్కల వీరభద్రరావు మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలతో ఫెడరేషన్ రూపుదిద్దుకోవాలని సూచించారు.
సోంపేట మాజీ సర్పంచ్ ఊట్ల మోహన గాంధీ ఫెడరేషన్ ఏర్పాటును స్వాగతిస్తూ, చేనేత కళాకారుల మెరుగైన జీవనం కోసం కృషి చేయాలన్నారు. బాసిన రామకృష్ణ ఎమ్మెల్సీ శ్రీమతి పోతుల సునీత గారికి చేనేత మంత్రిత్వశాఖను యివ్వాలని, అందుకు ఫెడరేషన్ వారు తగు రీతిలో ప్రాతినిధ్యం చేయాలని కోరారు.
చేనేత కళాకారులు రుద్రాక్షల సత్యనారాయణ అతుకు, కుట్టు లేకుండా మగ్గంపై తయారుచేసిన త్రివర్ణ పతాకం ఎర్రకోటపై ఎగరడానికి జరిగిన ప్రయత్నాలను డాక్టర్ హేమంత్ విశదీకరించారు. చేనేతలందరూ తమ పేరు చివర ‘నేత’ జతచేసుకోవాలని డాక్టర్ మందుల మోహన్ రావు పిలుపునిచ్చారు. చేనేత రిజర్వేషన్ చట్టం అమలుకు గట్టిగా కృషి చేయాలని మంచు చంద్రయ్య పిలుపునిచ్చారు.
కార్పొరేషన్ డైరెక్టర్ కరెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్హులైన నేతలందరికీ చేనేత పథకాలను, నేతన్న నేస్తంను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొండా జగదీశ్వర రావు మాట్లాడుతూ చేనేతలకు సమ న్యాయం కోసం చట్టసభలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, ఈ లోపు అన్ని పార్టీలు కొన్ని నియోజకవర్గాలలో శాసనసభ సీట్లు కేటాయించి సహకరించాలన్నారు.
పాలిశెట్టి మల్లిబాబు తమ ఆహ్వానం మేరకు శ్రీకాకుళంలో చేనేతల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కొణపల ప్రసాద్ మాట్లాడుతూ చేనేత సమాజం అభివృద్ధి చెందాలంటే పదవీ కాంక్ష లేకుండా మేధావులు, విద్యావంతులు సేవాభావంతో పనిచేయాలన్నారు. కొండవీటి బసవరాజు మాట్లాడుతూ కాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు దశాబ్దాల క్రితమే చేనేతల ఐక్యత, ఆవశ్యకతను గుర్తించి కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పుడు ఫెడరేషన్ ద్వారా విస్తృత కార్యక్రమాలకు అవకాశం కలిగిందన్నారు.
నాపా కుమార స్వామి మాట్లాడుతూ పిట్టి త్యాగరాయ శెట్టి స్ఫూర్తితో చేనేతలంతా చేనేత సమాజాభివృద్ధికి కృషి చేయాలని, ఫెడరేషన్ కార్యక్రమాల కొరకు కొంత నిధిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కొండపల్లి సతీష్ బాబు వీవర్స్ ఫెడరేషన్ ను బలోపేతం చేయుటకు కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తానని అన్నారు.
సమావేశంలో రామనాథంపరమేశ్వరరావు, యేసో శ్రీనివాసులు, కొడిదాసు శ్రీనివాసరావు, కాలేపు సూర్య ప్రసాద్, విశ్వనాధం సత్య పరదేశి, అమృతవల్లి, సుబ్బలక్ష్మి, నాలి అప్పారావు, గిడుతూరి రాము, ఇమంది అప్పారావు, కోసూరు చిరంజీవి,కడుపు కన్నయ్య,కూనాని రమేష్ బాబు, బడతల ప్రభాకర్, కొనిశెట్టి లక్ష్మయ్య, నందం పెంచలయ్య, తాడిపర్తి వెంకటేశ్వర్లు, గన్నె నాగేంద్ర, రాజు, కల్లూరి రమణ, కనపర్తి నాగేంద్ర, జి నరేంద్ర, తుమ్మలచర్ల వెంకటేశ్వర్లు, ఆకురాతి లక్ష్మికాంతం, నక్క ప్రసాద్, అల్లాడ శ్రీనివాస్, సీబీ చంద్రశేఖర్, దొర సన్యాసిరావు, గుంటుకు సంతోష్ కుమార్, అల్లంశెట్టి మెహనరావు, మాడుగుల శ్రీనివాస రావు, డొప్ప యేసుబాబు, ఈశ్వరరావు, బస్వా చక్రధరుడు, దున్న శ్రీనివాసరావు, మాడుగుల అనిల్, మనోజ్ ఖన్నా, పప్పు ఈశ్వరరావు, మోహన్ కుమార్ నాయుడు, పేకల రామకృష్ణ, కట్ట రామారావు, లబ్బా శ్రీనివాసరావు, దూబ రాజు, కొప్పుల రామ్ కుమార్, ఇమంది విశ్వేశ్వరరావు, పుచ్చల విశ్వేశ్వరరావు, చిన్నా రావు, శీరపు కుటుంబరావు, పందిరి రామకృష్ణ, ఎం ఎం శ్రీను, అల్లాడ అప్పారావు, గుత్తు రాజారావు, గుత్తు చిన్నారావు, వామనరావు, వట్టి శ్రీ నివాసరావు, గుడిమెట్ల వీర్రాజు, వాస కోటేశ్వరరావు, నిల్లా ఉదయ్ కుమార్, శలా శంకర్రావు కిషోర్, గుంటుకు నేతాజీ, రంగారావు, పేకల వెంకటరావు, రాజపంతుల ప్రకాశరావు, విల్సన్, రామారావు, గుంటుకు రవిశంకర్, సాంబశివరావు, తీడ ప్రసాద రావు గిడుతురి నీలాద్రి, మాదాబత్తుల రామకృష్ణ, మాడం భాను, కోసూరు బలరాం గారలు పలువురు చేనేత ప్రముఖులు పాల్గొన్నారు.
తీర్మానాలివి..
1) చేనేత మంత్రిత్వశాఖను చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకే కేటాయించాలి. 2) ఏపీలోని అన్ని చేనేత కుల సంఘాలు, చేనేత కార్మిక సంఘాలు, చేనేత వృత్తి సంఘాలు, చేనేత ఉద్యమ సంఘాలను ఐక్యం చేసి రాష్ట్రస్థాయిలో వీవర్స్ ఫెడరేషన్ ఏర్పాటు. 3) రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి, పట్టణ/గ్రామ స్థాయిలో సమన్వయ కమిటీ (అడ్‌హక్)ల నిర్మాణం. 4) పెళ్లిళ్ల ద్వారా చేనేతలందరి మధ్య బంధుత్వ, బాంధవ్యాలు పెంపొందించేందుకు చేసిన తీర్మాణానికి అంగీకారం.
రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణకు సహకరించిన ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ గుంటుకు చంద్రశేఖర్, కమిటీ సభ్యులందరికీ చేనేతకవి రాపోలు జగన్ ధన్యవాదాలు తెలిపి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.
చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Most popular online casino in Canada
