పద్మశాలీ వధూవరుల ఉచిత పరిచయ వేదికను కర్నూలులో నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన చిత్తారివీధిలోని భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా పద్మశాలీ సంఘం కర్నూలు పట్టణ అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ, భద్రావతి భావనారాయణ స్వామి ఆలయ కమిటి అధ్యక్షులు ఉప్పల లక్ష్మీనారాయణ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు వధువు/వరుడి వివరాలు, ఫోటో (క్లోజప్ ఉన్న మ్యాక్సి సైజు) వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
‘‘చాలాకాలంగా నంద్యాల రోడ్డులోని శ్రీ మణికంఠ ఫర్నిచర్ వర్క్స్ దుకాణంలో ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నాం. మా వద్ద దాదాపు 1000 యువతీ యువకుల ప్రొఫైల్స్ ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నారు. తమ పిల్లలకు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఆదివారం మా వద్దకు వస్తారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రొఫైల్స్ వాళ్ల ముందు ఉంచుతాం. అమ్మాయి/ అబ్బాయి నచ్చిన వారు వెంటనే ప్రొఫైల్స్‌లో పొందుపర్చిన సెల్ నంబర్‌కు ఫోన్ చేసి మిగతా వివరాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పటికి మా వద్ద 39 సంబంధాలు సెటిల్ అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మధ్యాహ్నం విందు కూడా ఏర్పాటు చేశాం. మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తుండడం ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.’’
– శిరసాల సుబ్బరాయుడు
సెల్ : 8328304311, 9440882867 Prämie Invexus

