వయోవృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు పేద కళాకారులకు జూన్ 30వ తేదీ కర్నూలులోని బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ సంఘం అధ్యక్షులు సహదేవరెడ్డి హాజరై మాట్లాడారు. కరోనా నేపథ్యంలో కుటుంబం గడవక ఇబ్బందిపడుతున్న కళాకారులకు నిత్యావసరాలు అందజేశామని తెలిపారు. ఒక్కొక్కరికి రూ. వెయ్యి విలువ చేసే నిత్యావసరాలను 12 మంది కళాకారులకు ఇచ్చామన్నారు. సంఘం కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికంగా చితికిన కళాకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, సంఘం కోశాధికారి క్రిష్టఫర్ , జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, గోశాల ప్రతినిధులు శ్రీకాంత్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

దిశ యాప్ వినియోగంపై కరపత్రాల పంపిణీ
మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దిశ మొబైల్ యాప్ గురించి బుట్టా ఫాండేషన్ ప్రజలకు అవగాహన కల్పించనుంది. యాప్ను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ముద్రించిన కరపత్రాలను ఫాండేషన్ సభ్యులు జూన్ 29వ తేదీ బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో విడుదల చేశారు. త్వరలో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తామని ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ తెలిపారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నాగరాజు, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సహదేవ రెడ్డి, కోశాధికారి క్రిస్టఫర్, నీలకటేశ్వర స్వామి గుడి చైర్మన్ యల్లప్ప, గోశాల ప్రతినిధులు శ్రీకాంత్, వెంకటేశ్వరులు, ఫౌండేషన్ కో ఆర్డినేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika
