విశాఖ జిల్లాలో ఓ అమ్మాయి కుటుంబానికి తగరపువరస పద్మశాలీ సంఘం అండగా నిలిచించి. పెళ్లి కోసం సంఘం సభ్యులు ఆర్థిక సాయం చేశారు.
విశాఖ జిల్లా తగరపువలస పట్టణం గ్రంథాలయం వీధిలో నివాసం ఉంటున్న మాదాబత్తుల శ్రీను, రూప దంపతులకు కూతురు, కొడుకు సంతానం. శ్రీను నూడిల్స్ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కొంతకాలం క్రితం పక్షవాతానికి గురికావడంతో కుటుంబం గడవడం కష్టమైంది. మరోవైపు కూతురి పెళ్లికి డబ్బు అవసరమైంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనుకు తగరపువలస పద్మశాలీ సంఘం బాసటగా నిలిచింది. తమ వంతు సాయంగా సంఘం అధ్యక్షుడు కొప్పల రమేష్, పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మిన రామలక్ష్మణ, గౌరవాధ్యక్షులు మాదాబత్తుల గురునాథ్, కొప్పల అప్పారావు (రాధిక), కోశాధికారి మురళి కలిసి రూ. 20 వేలను శ్రీను కుటుంబసభ్యులకు జూన్ 24వ తేదీ అందజేశారు. కార్యక్రమంలో క్యాషియర్ చింతల ఋషి, కొప్పల కృష్ణ, అప్పారావు, జోగా రాజారావు, కుంచం అప్పలరాజు, బడిగంటి మహేష్, మురళి, పూర్ణ, ఏలూరి శంకర్, ఫణి బ్రదర్స్, కొల్లి గోవింద్ బ్రదర్స్, కృష్ణ, వానపల్లి కిషోర్, వెంకటేష్, బండారు ఎర్రిబాబు , సూర్య, టైలర్ సత్తిబాబు, టైలర్ నూలు గోవిందు, తమ్మిన ప్రసాద్, తమ్మిన శంకర్, కల్లూరి తరుణ్ పాల్గొన్నారు.website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Bitnex Crestfort
