నిత్యావసరాల కిట్ల పంపిణీ – ఉదారత చాటుకున్న డీఎస్‌ఆర్‌ హ్యాండ్లూమ్‌ అధినేత దామర్ల శివయ్య

చీరాల పట్టణంలోని దామర్ల సుబ్బారావు (డీఎస్‌ఆర్‌) హ్యాండ్లూమ్‌ అధినేత దామర్ల శివయ్య దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా నేపథ్యంలో తమ సిబ్బందికి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. రూ. 1300 విలువ చేసే కిట్‌ను (బియ్యం బస్తా, నిత్యావసరాలు, కూరగాయలు) 100 మంది సిబ్బందికి జూన్‌ 26వ తేదీ అందజేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ యువనేత కరణం వెంకటేష్‌ బాబు ముఖ్య అతిథిగా హాజరై కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీకాంత్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, బాలా హ్యాండ్లూమ్స్ అధినేత బండారు బాలనాగేశ్వరరావు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, చేనేత నాయకులు గోలి గిరి కుమార్‌, రాజేష్‌ గుంటి, కారంపూడి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు దశాబ్దాలుగా వ్యాపారంలో..

“సుమారు 40 ఏళ్ల నుంచి వస్త్ర వ్యాపారంలో ఉన్నాం. మా సొంత మగ్గాలపై కొన్ని రకాల వస్త్రాలను నేయిస్తాం. అలాగే వివిధ ప్రాంతాల్లోని చేనేత సొసైటీలు, మాస్టర్‌ వీవర్లకు అవసరమైన ముడిసరుకును మేమే సప్లై చేస్తాం. కుప్పడం, వెంకటగిరి, గద్వాల, పోచంపల్లి, ఇక్కత్‌, కలంకారి, ఆరణి పట్టు, వైష్ణవి పట్టు వస్త్రాలు విక్రయించడం మా ప్రత్యేకత. హ్యాండ్‌లూం కాటన్‌, పట్టు, డిజైనర్‌ చీరలు కూడా ఉన్నాయి. మా దుకాణంలో రూ. 400 మొదలు రూ. 20వేల వరకు పట్టు వస్త్రాలు దొరుకుతాయి. కస్టమర్లకు సంతృప్తకర సేవలందించడమే లక్ష్యంగా, అంకితభావంతో పనిచేసే సిబ్బందితో దుకాణం నిర్వహిస్తున్నాం.”
– దామర్ల శివయ్య తనయుడు ప్రసాద్‌,
డీఎస్‌ఆర్‌ టెక్స్టైల్స్  హైస్కూల్‌ రోడ్‌, పేరాల, చీరాల.website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Wealthicator

Follow us on social media

Related posts

Leave a Comment