కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన వెంగళ ప్రసాద్ (55) పేద చేనేత కార్మికుడు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై పోరంకి క్యాపిటల్ ఆసుపత్రిలోని ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. వెంగళ ప్రసాద్ పూర్తి వివరాలను తెలుసుకున్న పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీవా) కేంద్ర కమిటీ సభ్యులు తమవంతు సాయంగా ఆయన కుమారుడు వేణుగోపాల్‌కు జూన్ 22వ తేదీ విజయవాడలోని పీవా కేంద్ర కార్యాలయంలో రూ. 10వేలు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో పీవా కోశాధికారి నీలి కనకదుర్గ ప్రసాదరావు, కేంద్ర కమిటీ సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయి), కార్యాలయ ఇన్‌చార్జి చిలుకోటి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంగళ ప్రసాద్‌కు అండగా నిలవడం అభినందనీయమని పీవా సభ్యులను పలువురు అభినందించారు.
మీ ప్రాంతంలో జరిగే కార్యక్రమాల వివరాలు, ఫొటోలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరు. వాటిని వెబ్‌సైట్ www.chenetamitra.com లో ఉంచడంతో పాటు చేనేతమిత్ర మాసపత్రికలో ప్రచురిస్తాం.
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Ziskovum
