జూన్‌ 21న ”పద్మశాలి దర్శిని” యాప్‌ ఆవిష్కరణ

అఖిల భారత పద్మశాలీ సంఘం శతాబ్ది (1921-2021) ఉత్సవాల నేపథ్యంలో పద్మశాలి దర్శిని యాప్‌ను జూన్‌ 21వ తేదీ ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నారు.

యాప్‌ ప్రయోజనాలివి..
పద్మశాలియులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది.పద్మశాలీ కులవిశిష్ఠత, సంఘం నిర్మాణంలో ప్రముఖుల పాత్ర తెలుసుకోవచ్చు. మార్కండేయ స్వామి ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పద్మశాలీ అన్నదాత సత్రాల వివరాలు చూడవచ్చు. వివాహ సంబంధాలు, వ్యాపారాభివృద్ధికి ఎంతో దోహదం పడుతుంది.


యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమ వివరాలు..
అఖిల భారత పద్మశాలీ సంఘం (హైదరాబాద్‌) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నారాయణగూడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు పద్మశాలి ప్రముఖులు హాజరవుతున్నారు.

అఖిల భారత పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు జిని రామమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సంఘం అధ్యక్షులు శ్రీధర్‌ ఎన్‌. సుంకుర్‌వార్‌ యాప్‌ను ఆవిష్కరిస్తారు. ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి యాప్‌ ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు. ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం స్వాగతోపన్యాసం చేస్తారు. సంఘం యువజన విభాగం అధ్యక్షులు గుండేటి శ్రీధర్‌ యాప్‌ ఏ విధంగా పనిచేస్తుంది, యాప్‌ వల్ల లాభాలను సవివరంగా వివరిస్తారు.

గౌరవ అతిథులుగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, మాజీ మంత్రి ఎల్‌. రమణ, మాజీ విప్‌ ఎరవత్రి అనిల్‌ కుమార్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బీఎస్‌ రాములు, డబ్ల్యూడబ్ల్యూటీ చైర్మన్‌ బర్రెంకల మధుసూధన్‌, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బాబు రావు హాజరవుతున్నారు.

అలాగే ప్రత్యేక అతిథులుగా అఖిల భారత పద్మశాలీ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, అఖిల భారత ఇంజనీరింగ్‌ విభాగం పద్మశాలీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పుత్తా పాండు రంగయ్య, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నక్కా వేణుమాధవన్‌, అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బోగా జగదీశ్‌, అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షులు వెంకన్న, తెలంగాణ పద్మశాలీ సంఘం గౌరవాధ్యక్షురాలు గుంటక రూప రజని, అఖిల భారత పద్మశాలీ సంఘం న్యాయవిభాగం అధ్యక్షులు వనం విశ్వనాథమ్‌, సంఘం కార్యదర్శి కొక్కుల దేవేందర్‌, తదితరులు విచ్చేస్తున్నారు.

యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పద్మశాలి దర్శిని యూటూబ్‌ చానల్‌లో కూడా వీక్షించవచ్చు. 

మీ  ప్రాంతంలో  జరిగే కార్యక్రమాల వివరాలు, ఫొటోలను వాట్సప్‌ నంబర్‌ 8333871117కు పంపగలరు. వాటిని వెబ్‌సైట్‌  www.chenetamitra.com లో ఉంచడంతో పాటు చేనేతమిత్ర మాసపత్రికలో ప్రచురిస్తాం.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Zlatá Era

Follow us on social media

Related posts

Leave a Comment