ప్రతిభాశాలి ప్రగడ కోటయ్య: ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (రిటైర్డ్) ఆలేటి వెంకట నారాయణ

చేనేత సమాజానికి స్ఫూర్తి ప్రదాత ప్రగడ కోటయ్య అని పలువురు కొనియాడారు. ఆయన సేవలను ఎప్పటికి మరవరాదన్నారు. ముందు తరాలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రగడ కోటయ్య వర్ధంతి సందర్భంగా చేనేత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంక్షేమ సంఘం (వెపా) సమన్వయ కర్త కె. వెంకటశేషయ్య, గుంటూరు జిల్లా బాధ్యులు రాపోలు జగన్‌ నవంబర్‌ 26వ తేదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 11 గంటల వరకు నిర్విరామంగా కొనసాగిన ఈ సమావేశంలో చేనేత రంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగించారు.

‘‘ప్రగడ కోటయ్య గారు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. పూర్వం ఆధిపత్య వర్గాల వారే చైర్మన్‌గా ఉండటం వల్ల గుంటూరు వైద్య కళాశాలలో సీట్లను తమ సామాజిక వర్గానికి చెందినవారితోనే భర్తీ చేసేవారు. దీన్ని ప్రగడ కోటయ్య తీవ్రంగా వ్యతిరేకించారు.
తాను చైర్మన్‌ అయ్యాక చేనేత సమాజంతో పాటు బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులతో సీట్లను భర్తీ చేయించారు. దీనిపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు ధీటుగా సమాధానమిచ్చారు. కోటయ్య లాంటి ధైర్యవంతులు మరొకరు లేరు. చేనేత సమాజానికి చెందిన ఉన్నతోద్యోగులు ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలకు లోబడి సాటి చేనేత వర్గాలకు న్యాయం చేయాలి. అప్పుడు చేనేత సమాజం వికసిస్తుంది. ’’
– ఆలేటి వెంకట నారాయణ, విశ్రాంత ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్

“ప్రగడ కోటయ్య గారి జీవితం రాజకీయ, సామాజిక చైతన్యనానికి స్ఫూర్తి. అప్పట్లోనే 19 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను మరవలేం. చరిత్రను, చరిత్రకారులను ఎప్పటికీ మరువరాదు. వస్త్రాలకు, దుకాణాలకు ప్రగడ కోటయ్య పేరు పెట్టాలి. ఆయన వర్ధంతి, జయంతి రోజున ఆటలు, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి. చేనేత రంగానికి కృషి చేసిన ప్రముఖుల జీవితాలను పుస్తకాలు, కరపత్రాల రూపంలో ముద్రించి మన భావితరాలను తెలపాలి.”
– బి. శ్రీరాములు, బీసీ కమిషన్‌ చైర్మన్‌, తెలంగాణ.

‘‘రెండు వందల సంవత్సరాల క్రితమే పల్నాడు ప్రాంతం చేనేత సామాజిక వర్గానికి చెందిన కవయిత్రి దార్ల సుందరమ్మ సమాజంలోని కుళ్లును పద్యాల రూపంలో ఎండగట్టారు. కానీ ఆనాటి పాలకులు ఆమెను అణచి వేశారు. దార్లసుందరమ్మ, ప్రగడ కోటయ్య లాంటి స్ఫూర్తిదాయకుల జీవితాలను పాఠ్యపుస్తకాలలో పాఠాలుగా పొందుపర్చాలి.’’
– సంగిశెట్టి శ్రీనివాస్‌, ప్రముఖ పాత్రికేయులు, వ్యాసరచయిత

“చేనేత వర్గాలు రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు పడాలి. స్వతంత్య్ర రాజకీయ శక్తిగా ఎదగాలి. కోటయ్య వర్ధంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ఏర్పాటు చేసిన కేవీ శేషయ్య, రాపోలు జగన్‌ను ధన్యవాదాలు.”
-వైకే, సామాజిక వేత్త, హైకోర్టు న్యాయవాది.

“ప్రగడ కోటయ్య జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. చీరాలలో ఆయనకు ‘ప్రజాబంధు’ బిరుదును ప్రదానం చేశారు.
– తడక యాదగిరి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నిజాం కళాశాల, హైదరాబాద్‌.”

“అట్టడుగు బలహీన వర్గాలు కోటయ్య వెంట నడిచాయి. ఆయన జీవితం నేటి చేనేత సమాజానికి స్ఫూర్తి దాయకం.”
– రాపోలు ఆనంద భాస్కర్‌, రాజ్యసభ మాజీ సభ్యులు.

“చేనేత రంగానికి కోటయ్య చేసిన కృషి చాలా గొప్పది. గూగుల్‌ మీట్‌లో సమయపాలన ముఖ్యమని, సమావేశంలో పాల్గొన్న వారు మొదటి నుంచి చివరివరకు ఉంటే బాగుంటుంది.”
– బండారు ఆనంద ప్రసాద్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, పెడన.

“చేనేత రంగ పరిరక్షణకు ప్రగడ కోటయ్య ఎంతో శ్రమించారు. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని ఆయన నిరూపించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. చేనేత సమాజ అభ్యున్నతికి అందరం కలిసికట్టుగా ఉద్యమించాల్సిన సమయమిది.”
– గంజి చిరంజీవి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, మంగళగిరి.

“ప్రగడ కోటయ్య అడుగు జాడల్లో నడవాలి. చేనేతలంతా ఏకతాటిపైకి వస్తే సామాజిక వర్గం బలపడుతుంది. ఈ క్రమంలో గత మూడేళ్ల నుంచి ‘వెపా’ చేస్తున్న కృషి అభినందనీయం. చేనేతల సమస్యల పరిష్కారానికి నా సహకారం తప్పక ఉంటుంది.”
– తిరందాసు యాదగిరి, హైదరాబాద్‌.

దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బీరక సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాధికారం కీలకం, ప్రగడ కోటయ్య స్ఫూర్తితో చేనేత సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

వీడియో కాన్ఫెరెన్సులో బట్టు సుబ్బారావు (రాజోలు), బత్తుల వీర వెంకట సత్యనారాయణ, డా. పరికిపండ్ల అశోక్‌ (వరంగల్‌), పొలిశెట్టి మల్లిబాబు, మామిళ్ల లోకనాథం, చిలువేరు మార్కండేయ, మునగపాటి వెంకటసుబ్బారావు (చీరాల), అందె మురళి వరప్రసాద్‌, కందుకూరు (పోలీసు), బీ. రాధాకృష్ణ, అవ్వారు రామారావు, దివి శాస్త్రి, మురుగుడు శ్రీహరి, డా. బీపీఎస్‌ కళ్యాణి, కప్పల రామారావు, చాయా ఓంకారయ్య, రామమోహన్‌ రావు, వంగర చేతన్‌ కుమార్‌, వరహాల మోహన్‌రావు, ఆర్‌. వెంకటేశ్వర్లు, వావిలాల సరళాదేవి, ఆలేటి వెంకట నారాయణ, చంద్రశేఖర్‌ (శ్రీకాకుళం), అందే శాంతారాం (చీరాల), అనంత వెంకటరమణ, అవ్వారు హరికృష్ణ, తేజశ్రీదేవి, రామకృష్ణ (నాగార్జున యూనివర్సిటీ), కే. రామారావు (విజయనగరం), ఎం. వెంకటేశ్వర్లు, కొండపల్లి సతీష్‌ బాబు (విశాఖ), గంజి విద్యాసాగర్‌ (భద్రాచలం), పోలిశెట్టి శ్రీహరిబాబు, జి. మోహన్‌రావు, బడతల ప్రభాకర్‌, కోడూరు శివకుమార్‌, గౌరాబత్తిన మోహన్‌ రావు, చిలుకోటి శ్రీమన్నారాయణ, బూదాటి బాలకోటేశ్వర రావు, వంగర రాజగోపాల్‌, భువనగిరి మల్లికార్జున, ఎం. శ్రావణ్‌కుమార్‌, పముజల సుధాకర్‌, పముజల మల్లికార్జునయ్య, గుత్తికొండ లక్ష్మీనారాయణ, మంచా సుబ్రహ్మణ్యం, వింజమూరి వాసు, పి. చంద్రశేఖర్‌, దివి చంద్రశేఖర్‌, పోలిశెట్టి శ్రీహరిబాబు, కొనిశెట్టి లక్ష్మయ్య పాల్గొన్నారు. చేనేత సమాజ అభ్యున్నతికి, అభివృద్ధికి వెపా చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వెపాకు తమ వంతు సహకారం ఎల్లపుడూ ఉంటుందన్నారు.

తాటిపర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. వందన సమర్పణ చేసి సమావేశాన్ని ముగించారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Wealthicator

Follow us on social media

Related posts

Leave a Comment