దివంగత ప్రగడ కోటయ్య వర్ధంతి సందర్భంగా 26వ తేదీ సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని చేనేత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంక్షేమ సంఘం (వెపా) సమన్వయ కర్త కె. వెంకటశేషయ్య, గుంటూరు జిల్లా బాధ్యులు రాపోలు జగన్ తెలిపారు. ‘ప్రగడ కోటయ్య స్ఫూర్తి – చేనేతల భవిష్యత్తు – దిశానిర్దేశం’ అంశంపై నిర్వహించే ఈ సమావేశానికి పలువురు ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని చేనేత మేధావులు, చేనేత కార్పొరేషన్ల చైర్మన్లను ఆహ్వానించారు.
ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి (సెక్రటరీ, కమిషనర్, మధ్యప్రదేశ్), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రిటైర్డు) ఆలేటి వెంకట నారాయణ, రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, మాజీమంత్రి (తెలంగాణ) ఎల్. రమణ, ప్రథమ చేనేత కార్పొరేషన్ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ చైర్పర్సన్ గడ్డం సునీత, కుర్ణిశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ బుట్టా శారదమ్మ, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. తడక యాదగిరి, విజయనగరం ఎంఆర్ కళాశాల ప్రధానాచార్యులు డా. వానపల్లి వెంకటరావు, సామాజిక వేత్త, హైకోర్టు న్యాయవాది వై.కే, ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీ డైరెక్టర్ డా. మేరువ వెంకటేశ్వర్లు, ఆడిట్ ఆఫీసర్ (నెల్లూరు) ఎస్. తిరుపతయ్య, సీనియర్ చేనేత నాయకులు (మంగళగిరి) చిల్లపల్లి మోహనరావు, పార్లమెంట్ మాజీ సభ్యులు నిమ్మల కిష్టప్ప, బీసీ కమిషన్ (తెలంగాణ ) ప్రథమ అధ్యక్షులు బీఎస్ రాములు, ఆంధ్ర విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బీపీఎస్ కళ్యాణి, పెడన మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, సామాజిక విశ్లేషకులు, చరిత్రకారులు సంగిశెట్టి శ్రీనివాస్, రాజమండ్రి వైద్యకళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్ఆర్ మహేష్, కార్పొరేషన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ (రిటైర్డు) రామనాథం పరమేశ్వర్, రాయలసీమ సీనియర్ చేనేత నాయకులు డి. కే. నాగరాజు, తెలంగాణ సచివాలయం అసిస్టెంట్ సెక్రటరీ తిరందాసు యాదగిరి, శాంతినికేషన్ విద్యాసంస్థల చైర్మన్ (శ్రీకాకుళం) గుంటుకు చంద్రశేఖర్ కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో చేనేతలంతా పాల్గొనాలని వెంకటశేషయ్య విజ్ఞప్తి చేశారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Хτrаdеgrοk 8.1 Flех
