చేనేత కళాకారులకు అండగా ఏపీ వెపా – నెల్లూరులో చేనేత వస్త్రాలయం ఏర్పాటు

కరోనా నేపథ్యంలో చేనేత కళాకారులు తయారుచేసిన ఉత్పత్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్‌ చేనేత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంక్షేమ సంఘం (ఏపీ వెపా) తన వంతు బాధ్యతగా వారికి అండగా నిలిచింది. వారి ఉత్పత్తులను నెల్లూరు జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో విక్రయించేందుకు చేనేత వస్త్రాలయాన్ని ఏర్పాట్లు చేసింది. దీన్ని అక్టోబర్‌ 22వ తేదీ సాయంత్రం డిప్యూటీ కలెక్టర్‌ ఎం. వెంకట సుధాకర్‌ ప్రారంభించారు. తొలిరోజే రూ. లక్ష విలువ చేసే చేనేత ఉత్పత్తులకు విక్రయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ మేనేజర్‌ ఎస్‌వి సురేష్‌, పరిశ్రమల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గుత్తికొండ మురళి, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వి. వెంకటశేషయ్య, మణ్ణెం దంత వైద్యశాల డాక్టర్‌ సతీష్‌, ఎన్‌డీసీసీ బ్యాంకు మేనేజర్‌ డి. చంద్రశేఖర్‌ రావు, ఇందుకూరు జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయిని ఎస్‌.మాధవి లక్ష్మి, ఏపీఎస్‌పీడీసీఎల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌
కె. రమేష్‌ బాబు, బీజేపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, వెపా ప్రధాన కార్యదర్శి బాల కోటేశ్వరరావు, కోశాధికారి ప్రభాకర్‌ రావు, ఎస్‌బీఐ మేనేజర్‌ కొంగర మురళి పాల్గొన్నారు.

కాదని నిరూపిస్తే 3 రెట్ల పరిహారం..
చేనేత వృత్తిదారులకు అండగా నిలవడమే మా లక్ష్యం. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వారి ఇళ్లలో నిలిచిపోయిన వస్త్ర నిల్వలను సేకరిస్తున్నాం. ముఖ్యంగా వెంకటగిరి, పొందూరు, నారాయణ రెడ్డి పేట, పాతూరు, పూత్తూరు ప్రాంతాల నుంచి చీరెలు, దుప్పట్లు, లుంగీలు, టవళ్లు, డ్రస్‌ మెటీరియల్‌ తెప్పించాం. వీటిని మగ్గం రేట్లకే అమ్మి, వచ్చిన డబ్బును వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తాం. ఉత్పత్తులన్నీ మగ్గాల మీద నేసినవే. నూటికి నూరుపాళ్లు నాణ్యమైనవి. మగ్గం మీద నేసినవి కాదని నిరూపిస్తే కొన్న దుస్తుల ధరకు మూడు రెట్లు పరిహారం చెల్లిస్తాం.

త్వరలో సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జిల్లాలోని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లోని ముఖ్యమైన కూడళ్లలో సెలవు రోజుల్లో స్టాళ్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. పూర్తిగా సేవాభావంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలి. చేనేత వస్త్రాలు కొని నేత కార్మికులకు అండగా నిలవాలి. నెల్లూరులో లక్ష్మీపురంలోని ఎస్బీఐ ఏటీఎం కౌంటర్‌పైన ఉన్న వెపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలయాన్ని ప్రజలంతా సందర్శించాలని నా మనవి.
– కె. వెంకట శేషయ్య, ఏపీ వెపా సమన్వయకర్త, నెల్లూరు. Bitnex Crestfort

Follow us on social media

Related posts

Leave a Comment