రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో చేనేత కార్మికులు గత కొన్ని రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో దీక్షలను తాత్కాలికంగా విరమించుకోక తప్పడం లేదని పేర్కొన్నారు. దీక్షలపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపడుతున్న చేనేత రిలే నిరాహార దీక్షలను విరమించాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షులు సీహెచ్ ధనుంజయ, ప్రధాన కార్యదర్శి రాపోలు వీర మోహన్ కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న తరుణంలో దీక్షలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలపై పాలకులు స్పందించకపోయినా.. భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణతో ముందుకు వస్తామన్నారు. సమావేశంలో పద్మశాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏలె భిక్షపతి, ప్రధాన కార్యదర్శి పోచం కన్నయ్య పాల్గొన్నారు. Immediate Edge


