ఐక్యత, బలోపేతమే లక్ష్యం: వీడియో కాన్ఫరెన్సులో చేనేత ప్రముఖులు

చేనేత సమాజ వర్గ ఐక్యత, బలోపేతమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని పలువురు పద్మశాలీ ప్రముఖులు పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఏపీలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 50 మంది చేనేత ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని కొన్నింటిని చేనేతకవి రాపోలు జగన్‌ ‘చేనేతమిత్ర’తో పంచుకున్నారు.

“చేనేత సమాజంలో ఐక్యత రావాలి. ఐక్యత లోపించడం వల్లే ఇప్పటికే చాలా నష్టపోయాం. మొదట 13 జిల్లాలోని పద్మశాలీయులనంతా ఒక తాటిపైకి తెస్తాం. ఐక్యత సాధించాక.. ఇతర వర్గాల వారితో కలిసి జేఎసీగా ఏర్పడి విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో న్యాయమైన వాటా సాధించేందుకు కలిసికట్టుగా పోరాడతాం. యువకులు ముందుకు రావాలి. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో పనిచేస్తూ చేనేత సమాజాభివృద్ధికి కృషిచేయాలి” అని కాన్ఫరెన్సులో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారని జగన్‌ తెలిపారు. ఏపీ వీవర్స్ ఎంప్లాయిస్‌, ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శేషయ్య, ఏపీ పద్మశాలీ రాష్ట్ర అధ్యక్షులు కేఎన్‌ మూర్తి, జగ్గారపు శ్రీనివాస్‌, వానపల్లి వెంకట్రావు, సుదర్శన చక్రధారి, బీపీఎస్‌ కళ్యాణి (వైజాగ్‌), జీసీ వీరయ్య, బీవీవీ సత్యనారాయణ, పులిపాటి గంగాధర్‌, నీలంశెట్టి సత్యప్రసాద్‌, నక్క వెంకటేశ్వర రావు, వొద్ది నరసింహులు, ముషం అనంతరాములు, చిలువేరు మార్కండేయులు, గుద్దంటి లీలా గోకర్ణ శాస్త్రి, జీవీ నాగేశ్వరరావు, చంద్రశేఖర్‌, సంగెళ్ల కనకదుర్గ, కొడిదాసు శ్రీనివాసరావు, కందగట్ల సుదర్శన్‌, నల్లు సంజీవ్‌కుమార్‌, ఎఎల్‌వీ ప్రసాద్‌, వింజమూరి వెంకు, ఎం రమేష్‌, వానపల్లి నాగరాజు, నాని సేనాపతి, మునగపాటి వెంకటేశ్వర రావు, పొన్నగంటి పాపారావు, జీవీఎస్‌ రామకృష్ణ, చిన్నం హరిగోపాల్‌, లక్ష్మీనారాయణ, చాగలేటి శ్రీలక్ష్మి, మనోహర్‌, పరమేష్‌ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. Nový Kapitstav

Follow us on social media

Related posts

One Thought to “ఐక్యత, బలోపేతమే లక్ష్యం: వీడియో కాన్ఫరెన్సులో చేనేత ప్రముఖులు

  1. C S P Narayana Murthy

    At the outset I must congratulate the concerned for their bold initiative to unite together.
    Sri Jagan garu, as you know many of our cast elderly and dynamic stawlarts in Andhra also, pl. make a humble attempt to polarise them; beginning with employees.
    Later we think of uniting the trades and others.
    With fraternal greetings.
    CSP Narayana Murthy

Leave a Comment