సీఆర్డీఏ చట్టం రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లును ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించడం హర్షనీయమని కర్నూలు పార్లమెంటు సభ్యులు డా. సింగరి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఇకపై శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి, పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలును అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ రాజముద్ర వేశారని, దీంతో రాయలసీమవాసుల ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజల తరుపున ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. Liman Dexeris

