స్వాతంత్య్ర సమరమోధులు సాయిని వెంకటేశం దాతృత్వం – చేనేత పేద కుటుంబాలను ఆదుకోవడంపై హర్షం

స్వాతంత్య్ర సమరమోధులు సాయిని వెంకటేశం ఉదారతను చాటుకుంటున్నారు. తన పింఛన్‌ డబ్బు రూ. 2 లక్షలను ఇటీవల యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, జనగాం జిల్లాలోని పోచంపల్లి, చిన్న కొండూరు, నేలపట్ల, మందోళ్ల గూడెం, వెల్లంకి, జనగా, కే.సారం, కోయలగూడెం, హయత్‌ నగర్‌, ఎల్‌బీ నగర్‌ ప్రాంతాల్లోని 260 చేనేత పేద కార్మికులకు శ్రీ సాయిని వెంకటేశం, శ్రీమతి పుష్పలత చారిటబుల్‌ ట్రస్టు (హైదరాబాద్‌) తరుపున పంపిణీ చేయించారు. 90 ఏళ్ల సాయిని వెంకటేశం చేనేత కార్మికుల కష్టాలు, ఇబ్బందులపై నిత్యం స్పందిస్తుంటారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, జనగాం జిల్లాలోని 150 చేనేత కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. ఇటీవల బలవనర్మణానికి పాల్పడ్డ నేతన్నల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5వేలు నగదు, నిత్యావసరాలు పంపిణీ చేయించారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్న చేనేతలకు మందులు సమకూర్చారు. ఎంతోమంది చేనేత పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. వృద్ధాప్యంలోనూ సామాజిక బాధ్యతగా తన పింఛన్‌ డబ్బును చేనేత పేద కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవడంపై పలువురు వెంకటేశంను అభినందిస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమాల్లో అఖిల భారత పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ బోర్డు మాజీ సభ్యులు తడక యాదగిరి, పద్మశాలీ మిషన్‌ కోశాధికారి చిక్క చందు పాల్గొన్నారు. Fundex Bitport

Follow us on social media

Related posts

Leave a Comment