కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక జన్మదిన వేడుకలు జూన్ 21వ తేదీన నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. కర్నూలు నగరంలో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లోనూ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.
బుట్టా రేణుక గురించి క్లుప్తంగా..

బుట్టా రేణుక స్వస్థలం కర్నూలు జిల్లాలోని పత్తికొండ. వ్యాపార వేత్తగా, హైదరాబాద్లో విద్యా సంస్థల అధినేతగా రాణిస్తోన్న బుట్టా రేణుక 2014 ఎన్నికలలో కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడుపై 44,131 ఓట్ల తేడాతో గెలుపొందారు. బీటీ నాయుడికి 4,28,651 ఓట్లు పడగా బుట్టా రేణుకకు 4,72,782 ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన కోట్ల జయ సూర్యప్రకాశరెడ్డి 1,16,603 ఓట్లు దక్కించుకున్నారు. ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ బుట్టా ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వందల మంది పేదలకు నిత్యావసరాలు అందజేశారు. పలువురికి ఆర్థిక సాయం చేశారు. మాస్కుల తయారీకి జౌళిశాఖకు వస్త్రాన్ని కొని ఇచ్చారు. బుట్టా రేణుక స్ఫూర్తితో ఎమ్మిగనూరు, కోసిగి మండల్లాలో యువకులు కాలి నడకన స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలకు ఆహారం, పండ్లు, నీళ్ల ప్యాకెట్లు అందజేశారు. గతంలో కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన దీక్షలకు బుట్టా రేణుక సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.
కర్నూలులో..




కర్నూలులో ఉదయం ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం సీతారాం నగర్లోని వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అల్పాహారం పెట్టారు. అలాగే కీర్తన అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. సాయంత్రం వైసీపీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తలు కేక్ కట్ చేశారు. కర్నూలు నగరంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో జాతీయ బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, కర్నూలు పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షులు, రోహిణి ఇన్ఫ్రా అధినేత కొంకతి లక్ష్మీనారాయణ, కోశాధికారి కాంచానం బాలాజీ, జిల్లా పరిషత్ అకౌంట్స్ ఆఫీసర్ శివశంకర్ , రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రామ్ ప్రసాద్, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సహదేవ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, వినియోగదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి నదీం హుసేన్, కేవీఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ విజయ భారతి, 42వ వార్డు వైసీపీ నాయకులు మదన్ మోహన్, దస్తగిరి, పలవర మద్దిలేటి, గోరంట్ల లక్ష్మీనారాయణ, రాయలసీమ మహిళా సంఘ్ అధ్యక్షురాలు గోరంట్ల శకుంతల, బీసీ నాయకులు రాంబాబు, ఈశ్వరయ్య, సతీష్, ఫౌండేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్, చరిత , హేమలత, లోకేష్, అగ్రహారం రమణమ్మ, కుర్ని సంఘం నాయకులు గడిగె ప్రసాద్, మోహన్ కృష్ణ పాల్గొని బుట్టా రేణుకకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కర్నూలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో..

కర్నూలు నియోజకవర్గంలోని కోసిగి, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, గూడూరు మండలాల్లోనూ బుట్టా రేణుక అభిమానులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కోవిడ్ నేపథ్యంలో బుట్టా అభిమానులు ఆదోనిలో మాస్కులు, పంపిణీ చేశారు. ఎమ్మిగనూరులో అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి మధ్యాహ్నం భోజనం వడ్డించారు. గూడూరులో నిరుపేదలకు బట్టలు పంపిణీ చేశారు. పత్తికొండలో వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కోడుమూరులోని ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కోసిగిలో రక్త దాతలను సన్మానించారు. గోనెగండ్ల, గంజహల్లిలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కోసిగిలోని ప్రతాప్, విజయ్ టీం, ఎమ్మిగనూరులో రఘువీరా, రాము, శివ టీం, ఆదోనిలో సతీష్ టీం, పత్తికొండలోని ఆసీఫ్ టీం, గోనెగండ్లలోని టీచర్ మునెప్ప టీం, గంజహల్లిలోని వీర నాయుడు టీం, కోడుమూరులోని లాయర్ ప్రభాకర్, కృష్ణ టీం, గూడూరు ప్రతాప్, శుభకర్ టీం, రేమట టీం, ఆస్పరి దత్తురెడ్డి, ఉల్చాల వెంకటేశ్ టీం సభ్యులకు బుట్టా రేణుక తరుపున ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. Ziskovum

