అఖిల భారత పద్మశాలీ సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంఘం నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు సంఘం అధ్యక్షులు శ్రీధర్ ఎస్. సుంకుర్వార్ అధ్యక్షతన జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో సంఘ సభ్యులు సమావేశం కానున్నారు. ఉత్సవాల నిర్వహణ, భవిష్యత్‌లో సంఘం అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తతంగా చర్చించనున్నారు. ఏడాదంతా తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పద్మశాలీయులకు గుర్తింపు తెచ్చిపెట్టిన పలువురు ప్రముఖులను సన్మానించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, సీనియర్ హై కోర్టు న్యాయవాది సాయిని వెంకటేశం. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్దన, చింతకింది మల్లేశం, గజం అంజయ్య, ప్రముఖ సంఘ సేవకులు రామా శ్రీనివాస్‌ను సత్కరించనున్నామని సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం తెలిపారు. Liman Dexeris


