పేద పద్మశాలీ కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు – జూన్‌ 6 నుంచి పంపిణీ : కొంకతి లక్ష్మీనారాయణ

బుట్టా ఫౌండేషన్‌, కర్నూలు పట్టణ పద్మశాలీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పేద పద్మశాలీ కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పద్మశాలీ సంఘం అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ తెలిపారు. జూన్‌ 5న సంఘం సభ్యులు కర్నూలులోని బుట్టా ఫౌండేషన్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొంకతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రూ. 300 విలువ చేసే ఒక్కో కిట్‌ (బియ్యం, కందిబ్యాళ్లు, చక్కెర, ఉప్మా రవ్వ, ఉల్లిగడ్డలు)ను జూన్‌ 6వ తేదీ నుంచి చిత్తారి వీధి, కుమ్మరి వీధి ప్రాంతాల్లోని పేద పద్మశాలీయుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని పద్మశాలీ సంఘం యువజన విభాగం అధ్యక్షులు కొంకతి వెంకటేష్‌ను కోరారు. 150 మంది కుటుంబాలకు వీటిని అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ మాట్లాడుతూ పద్మశాలీ సంఘం గతంలో కూడా 4000 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం కార్యదర్శి వెంకట నారాయణ, కోశాధికారి కాంచానం బాలాజీ, 42వ వార్డు వైసీపీ నాయకులు మదన్‌ మోహన్‌, ఫౌండేషన్‌ ప్రతినిధులు గణప చెన్నప్ప, పేలాల రాఘవేంద్ర పాల్గొన్నారు.

చేనేత వర్గాల సేవా కార్యక్రమాలు, కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు, నేత కార్మికుల సమస్యలు, పరిష్కార మార్గాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని 83338 71117కు పంపగలరు. Ascenso Finviora

Follow us on social media

Related posts

Leave a Comment